గత వారం నుంచి ‘ఫొని’ తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాలు, ఒడిషా రాష్ట్రాలు గజ గజ వణికి పోతున్నాయి.  ముఖ్యంగా ఫోని తుఫాన్ ప్రభావం ఏపిపై భారీగానే పడుతున్న నేపథ్యంలో  కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చింది.   

ఈసీ ఆదేశాలు తక్షణం అమల్లోకి రానున్నాయి. ఈ జిల్లాల్లో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఈసీ ప్రకటించింది.  అయితే గత కొన్ని రోజుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఉన్నందున తన చేతులు కట్టేస్తున్నారని..ఫొని తుఫాన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే..తాను ఎలాంటి సహకారాన్ని అందించలనేక పోతున్నాని..ఎలక్షన్ కమీషన్ పై విరుచుకు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబు కల నెరవేరిందనే అంటున్నారు.  ఇక ఫొని తుఫాన్ ప్రభావంతో మరో 3-4 గంటలు భారీ వర్షాలు, భీకరమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తాజా నిర్ణయం నేపథ్యంలో అధికారులు ఇక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేయనున్నారు. అలాగే ప్రభుత్వం ఇక్కడి పరిస్థితిని సమీక్షించడం వీలవుతుంది. ఒడిశాలోని పూరీ వద్ద ఫణి తుపాను తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: