పూజ‌లు చేస్తాం.. దేవున్నే ఆహ్వానిస్తాం.. మంత్రాలు చేస్తాం.. రోగాలు మ‌టుమాయం చేస్తాం.. ఇలా అంటూ జ‌నాన్ని మోసం చేస్తున్న బుడీ బాబాల‌కు రోజులు ద‌గ్గ‌ర బ‌డ్డాయి. ఇక ఇలాంటి మోసాలు సాగ‌వ‌న్నారు రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ పోలీసులు. ఎక్క‌డిక‌క్క‌డే అరెస్టులు చేస్తూ చెక్ పెట్టేస్తున్నారు. 


రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ర‌ఘుప‌తి అనే ఓ యువ‌కుడితో పాటు ఇలాంటి మోసాల‌పై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపారు. మ‌ఖ్యంగా క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని పెద్ద‌ప‌ల్లి, మంచిర్యాల జిల్లాల ప‌రిధిలో స్పెష‌ల్ డ్రైవ‌వ్‌లు నిర్వ‌హిస్తున్నారు పోలీసులు. స్పెష‌ల్ డ్రైవ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 22 మందిని వ‌ర‌కు బురిడీ బాబాల‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి ద‌గ్గ‌రి నుంచి భారీగా క్షుద్ర‌పూజ‌లకు సంబంధించి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇత‌ర వ‌స్తువుల‌ను కూడా స్వాధీన ప‌రుచుకున్నారు. 


ప‌ట్టుబ‌డ్డ వారంతా భూత‌వైద్యం, చేత‌బ‌డులు, బాణామ‌తుల‌తో పాటు, క్షుద్ర‌పూజ‌లు, మంత్రాల‌తో మీ రోగాల‌ను న‌యం చేస్తామంటూ.. మీ స‌మ‌స్య‌లు తొల‌గిస్తామంటూ గ‌త కొన్ని రోజులుగా మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ అమాయ ప్ర‌జ‌లను మోసం చేస్తున్నారు. మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. 


అనారోగ్యం ఉంద‌ని వెళ్తే త‌మ‌కు మాయ మాట‌లు చెప్పిన ఓ బురిడీ బాబు 20 వేల రూపాయ‌లు గుంజాడ‌ని బాధితులు వాపోయారు. అదేంటీ 20 వేలు ఎందుక‌ని నిల‌దీస్తే వారిపై బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని బాధితులు తెలిపార‌ని, అందుకే తాము పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్లు చెప్పారు. 
ఇలాంటి మోసాల‌పై ప్ర‌జ‌లు ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మత్తంగా ఉండాల‌ని అంటున్నారు పోలీసులు. మ‌రెవ‌రైనా ఇలాంటి మోసాల‌కు పాల్ప‌డితే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. వారిపై పీడీ యాక్ట్ కేసులు పెడతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. జీవితాంతం జైల్లో ఊస‌లు లెక్క‌బెట్టాల్సి వ‌స్తుంద‌ని బురిడీ బాబాల‌కు హెచ్చ‌రంచారు పోలీసులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: