ఒక అనుభవశాలిని ప్రేమకు, కామానికి తేడా అడిగితే ఇలా చెప్పాడు. వయసులో వుండేది ప్రేమ. వయసు కరిగిపోయాక వచ్చేది ప్రేమ అని. అంటే యవ్వనంలో ఉన్న వారిలో ప్రేమ ముసుగు తప్ప అసలు విషయం మాత్రం వేరు అన్నది అంతా చెబుతారు. ఇక ప్రేమకు పవిత్రత ఉంటుంది. హద్దూ పద్దులు ఉంటాయి. కామానికి కామా ఫుల్ స్టాపులు ఉండవంటే ఉండవు.


ఈ సంగతిని  అచ్చంగా ప్రపంచం గర్వించే భారతీయులు ఇపుడు నిరూపించడమే అసలైన వింత. డిల్లీలో పబ్లిక్ ప్లేస్ లో అందరూ  చూస్తుండగానే ఓ యువ జంట తమ ప్రేమ ముసుగును ఇలా తొలగించేసింది.  బైక్ ట్యాంకర్ మీద లవర్ కూర్చుకుని మరీ ప్రియుడికి హగ్గులు కిస్సులు నాన్ స్టాప్ గా ఇచ్చేస్తు ఉంటే  సినిమా చూసినట్లు చూడడం దారిన పోయే జనాల వంతు అయింది.


అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ గులాం  నుంచి బాగా ఇన్స్పిరేషన్ పొందినట్లుగా ఉంది ఈ జంట అని అంతా అనుకున్నారుట. ఎక్కడా గ్యాప్ లేకుండా ఆలా ఇద్దరూ పెనవేసుకుపోతుంటే మనమున్నది ఇండియాలోనేనా అన్న డౌట్లు చాలా మందికి పుట్టుకువచ్చాయట. ఏది ఏమైనా కాలం మారిపోయింది. దేశ రాజధానిలో కనిపించిన ఈ సీన్ రేపటి  రోజున దేశ‌మంతా కనిపించినా షాక్ తినక్కర్లేదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: