ఉత్తరాంధ్రను హడలెత్తించిన ఫోనీ తుపాను ఒడిషా వద్ద పూరీ తీరాన్ని తాకి పశ్చిమ బెంగాల్ కి వెళ్ళి బలహీనపడింది. అయితే ఈ తుపాన్ శ్రీకాకుళంలో స్రుష్టించిన భయం అంతా ఇంతా కాదు. తుపాను ధాటికి తొమ్మిది మండలాల్లో పరిస్థితి దారుణంగా మారింది. విద్యుతు సరఫరా లేకుండా ఉంది. భారీ ఎత్తున ఈదురుగాలులు వీచి మొత్తం వ్యవస్థలను కుప్ప కూల్చాయి. దాంతో సిక్కోలు చిక్కుల్లో పడింది.


ఇదిలా ఉండగా ఫోనీ తుపాను గురించి వైసీపీ అధినేత జగన్ ఆ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో ఆరా తీశారు. ఈ రోజు ఆయన వైసీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన క్రిష్ణ దాస్, కిల్లి క్రుపారాణి, తమ్మినేని సీతారాం తదితరులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఫోనీ వల్ల శ్రీకాకుళం ఎంత మేర దెబ్బ తింది. పరిస్థితి ఇపుడు ఎలా ఉంది అన్నది జగన్ ఆరా తీశారు.


అవసర‌మున్న చోట పెద్ద ఎత్తున సహాయ చర్యల్లో పాలుపంచుకోవాలని పార్టీ నాయకులకు సూచిందారని భోగట్టా. అలాగే, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తానికి జగన్  ఎక్కడా మీడియాలో హడావుడి చేయకున్నా పార్టీ పరంగా నేతలకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా తన బాధ్యతను నెరవేరుస్తున్నారని అంటున్నారు. అదే విధంగా ప్రజలకు అండగా ఉండాలని ఆయన శ్రేణులను కోరడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: