హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేశారు పోలీసులు. మహిళల్ని సెక్స్‌ కు ప్రేరిపించే మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ముఠా ఆటకట్టించారు. బెంగళూరులో తీగలాగితే హైదరాబాద్‌లో ఈ ముఠా డొంక కదిలింది. పోలీసులు విచారణలో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. ఈ గ్యాంగ్ చేసిన అరాచకాలు తెలిసి పోలీసులే షాక్ తింటున్నారు. ఈ డ్రగ్స్ వాడిన వ్యక్తి మృగంలా మారతాడని తద్వారా, రేప్‌ లకు కూడా దారితీయొచ్చని అధికారులు చెబుతున్నారు. ల్యాబ్‌ను సీజ్ చేసిన అధికారులు ప్రస్తుతం కంపెనీ యజమాని వెంకటేశ్‌ ను అదుపులోకి తీసుకుని మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Image result for Hyderabad drug mafia Intam labs
బెంగళూరులో డ్రగ్స్ కేసులో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ కేటామిని అనే మత్తు మందు ఇచ్చి, సృహ కోల్పోయిన అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీశారు. హైదరాబాద్‌ నుంచి సరఫరా అవుతున్నట్టు తేలడంతో రంగంలోకి దిగారు. నాచారంలోని 'ఇంతం ల్యాబ్‌' లో డ్రగ్స్ కంట్రోల్ బోర్డు సోదాలు నిర్వహించింది. మందుల తయారీలో కెటమైన్ అనే డ్రగ్ వాడుతున్నారని తేలడంతో, అధికారులు ల్యాబ్‌ను సీజ్ చేశారు. నగరంలో లైంగిక సామర్ధ్యాన్ని పెంపొందించే మందుల్ని అక్రమంగా తయారు చేస్తోన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కెటమైన్‌ అనే మత్తు మందును ఐదేళ్లుగా 'ఇంతం ల్యాబ్‌' తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 
 Image result for drugs activates men sex hormones 
పోలీసులు, డ్రగ్స్ కంట్రోల్ బోర్డ్ అధికారులు శుక్రవారం నాచారంలోని ఓ ల్యాబ్‌పై దాడులు చేశారు. వెంకటేష్‌ అనే నిర్వహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్‌ ని సీజ్ చేసి, మత్తు పదార్థాలు తయారు చేసే ముడి సరుకును సీజ్ చేశారు. ఈ ల్యాబ్‌లో ఐదేళ్లుగా డ్రగ్స్ తయారుచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ ముఠా డొంక మొత్తం కదిలించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. 
Image result for ketamines drug
ఆడవాళ్లపై ఈ డ్రగ్‌ను ప్రయోగించడంతో, ఆ తర్వాత ఐదు గంటలపాటు సృహ కోల్పోతారట. తర్వాత వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారట. ఈ డ్రగ్స్‌ తీసుకుంటే మనిషిలో సెక్స్‌ హార్మోన్లు పెరగుతాయట. కొందరు మహిళల పైనా ఈ డ్రగ్స్‌తో ప్రయోగాలు చేసినట్లు తేలిందట. సెక్స్ హార్మోన్లు పెరిగి, మృగంలా మారే సందర్భాలు ఉన్నాయట.

Image result for ketamines drug

మరింత సమాచారం తెలుసుకోండి: