దేవుడు కొన్ని జీవులకు ప్రత్యేక శక్తులు ఇచ్చాడన్న విషయం అనేక జంతువుల విషయంలో ఇప్పటికే మనం గమనించాం. కుక్కల ఘ్రాణశక్తి ఎంత పవర్ ఫుల్లో అవి దొంగలను వేటాడేటప్పుడు తెలుస్తుంది. నేర పరిశోధనలో వీటి సహాయం మరువలేనిది. 


కొన్ని జీవులు రాత్రి వేళల్లో బాగా చూడగలుగుతాయి. ఇలా ఒక్కో జీవిది ఒక్కో ప్రత్యేకత. కానీ సముద్ర తాబేళ్లు రాబోయే తుపానులను ముందే పసిగట్ట గలుగుతాయా.. అన్న సందేహం తాజాగా ఫోనీ తుపాను నేపథ్యంలో కలుగుతోంది. 

ఎందుకంటే..  ఏటా ఒడిశా సముద్రతీరానికి ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టడానికి లక్షల సంఖ్యలో వస్తుంటాయి. ఇవన్నీ ఒకే సమయంలో వస్తుంటాయి. ఏటా దాదాపు 5లక్షల తాబేళ్లు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది వాటి సంఖ్య అనూహ్యంగా  మూడు వేలకు పడిపోయింది. 

ఈ తగ్గుదల ఫోనీ తుపానును ముందుగా అంచనా వేయడం వల్లనేనే అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బెంగళూరుకు చెందిన ఐఎఫ్ఎస్‌ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ ఓ ట్వీట్ పోస్టు చేశారు. అన్ని జీవులకు వాతావరణ ముందస్తు హెచ్చరికల విభాగం అవసరం లేకపోవచ్చు. చాలా జీవులు వైపరీత్యాలను ముందుగానే గుర్తిస్తాయని పేరు పొందాయి. అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: