జేసి దివాకర్ రెడ్డి తానూ ఎన్నికల్లో ఎంత ఖర్చు చేసానో మీడియా ముందు పబ్లిక్ గా చెప్పారు. అయితే జేసి గారు ఏం మాట్లాడిన చెల్లుతుందని ఇన్ని రోజులు అధికార దాహంతో చెలరేగినాడు. అయితే  ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టాం..' అంటూ వృద్ధనారీ పతివ్రత అన్నట్టుగా మాట్లాడారు జేసీ దివాకర్ రెడ్డి. ఈ ఖర్చులు తగ్గించాలని.. దీనిపై మేధావులు స్పందించాలని తనకు సూటుగాని మాటలు మాట్లాడారు దివాకర్ రెడ్డి.


ఖర్చు పెట్టినట్టుగా ఒక వైపు చెప్పుకుని, మరోవైపు 'మార్పురావాలి- సంస్కరణలు తేవాలి.. 'అంటూ చెప్పుకొచ్చారీయన. ఆల్రెడీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యారు కదా.. ఇప్పుడు ఇలాంటి నీతులు ఎన్ని  అయినా చెప్పగలరు! అయితే నీతులు చెప్పడంతో పాటు తాము ఎన్నికల్లో గెలవడానికి అనంతపురం ఎంపీ సీటు పరిధిలో ఎంత డబ్బును ఖర్చు పెట్టినదీ కూడా ఒక నంబర్ ను చెప్పేశారు దివాకర్ రెడ్డి. తనే కాకుండా అందరూ అలా ఖర్చు పెట్టినట్టుగా దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.


వాళ్లు ఖర్చు పెట్టారో లేదో..వాళ్లెవ్వరూ తాము ఖర్చు పెట్టినట్టుగా ఇలా చెప్పుకోలేదు. చెప్పుకున్నది దివాకర్ రెడ్డి మాత్రమే. అందుకే ఆయనకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అనంతపురం కలెక్టర్  నుంచి దివాకర్ రెడ్డికి నోటీసులు వెళ్లాయట. 'ఎంత ఖర్చు పెట్టారు..ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు..' అని కలెక్టర్ అడిగినట్టుగా ఉన్నారు. మరి ఆ విషయాలకు దివాకర్ రెడ్డి సూటిగా సమాధానాలు ఇస్తారా, మీడియా ముందు చెప్పినట్టే కలెక్టర్ కూడా చెప్పి.. తను ఎంత డేరింగ్ వ్యక్తో చాటుకోవడానికి జేసీ సారు రెడీనా!

మరింత సమాచారం తెలుసుకోండి: