నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తరవాత తెచ్చిన అప్పులకు జరిగిన అభివృద్ధికి  ‘హస్తి మశాంతకం’ అంత అంతరముంది.  లోటు బడ్జెట్ తో నడుస్తున్న రాష్ట్రానికి ముఖ్య మంత్రికి  ఖరీదైన స్వంత హెలికాప్టర్ ఉపయోగించే అవసరం లేదు. అంతేకాదు ముఖ్యమంత్రి తన రాజకీయ, పార్టీ అవసరాలకు కూడా ప్రభుత్వ హెలీకాప్టర్,  ప్రభుత్వ  ఖర్చుతో ప్రయాణ నివాస తదితరాలు రాష్ట్రం భరించాల్సిన అవసరం లేనేలేదు.  


ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి ప్రయాణాల కోసం “ఓటాన్‌ అకౌంట్‌ నా లుగు నెలల బడ్జెట్‌” నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ₹ 10.36 కోట్లు విడుదల చేసింది. దేశంలో ఏ రాష్ట్రానికైనా లేదా రాష్ట్రంలోని ఏ జిల్లా కైనా చంద్రబాబు ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌ లోనే వెళ్తున్నారు. దీంతో ప్రజా వసరాలు తీరవు సరికదా! రాష్ట్ర ఋణభారం తడిసి మోపెడు ఔతుంది. రాష్ట్రం అప్పుల ఊబిలోకి దిగజారి దివాళా తీసే పరిస్థితులు ఏర్పదుతున్నాయి. కొందరు ఉద్యోగ వర్గాలకు కొన్ని నెలలుగా జీతబత్యాలు ఇవ్వకుండా ఆ సొమ్మును పసుపు కుంకుమ వంటి పథకాలకు తరలించారని ఎన్నికల ప్రయోజనాలకే ఆపని చేశారని ప్రతిపక్షం ఆరోపిస్తుంది.

Related image

ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి గా సింగపూర్‌ పర్యటనకు వెళ్లారు. సింగపూర్‌ కు కూడా ప్రత్యేక విమానంలో వెళ్లిన ముఖ్యమంత్రిగా బాబు రికార్డు సృష్టించారు. ఇతర దేశాలకు ఎప్పుడు వెళ్లినా ప్రత్యేక విమానాలే వాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి రెగ్యులర్‌ విమానాలున్నప్పటికీ గత ఐదేళ్లుగా ప్రత్యేక విమానం లోనే ప్రయాణాలు చేశారు. అధికార పర్యటన లైనా, పార్టీ పర్యటన లైనా ప్రత్యేక విమానాల్లోనే చంద్రబాబు వెళ్తూ వచ్చారు.


ఫ్రధాని ప్రత్యేక విమానాలు వాడటం లేదా? అని చంద్రబాబు అనవచ్చు. అక్కడ ప్రపంచం ముందు మన దేశం నిలబడాలి కదా! అందుకే వస్త్రధారణ తదితరాలు అవసరం అవుతాయి. ఫ్రతి దానికి ప్రధానిని విమర్శిస్తూపోతే రాష్ట్రానికి రావలసిన అందవలసిన ప్రయోజనాల మాటేమిటి? సుహృద్భావ వాతావరణం సృష్టించుకోలేని ముఖ్యమంత్రి ఉన్నా ఊడినా ఒకటే అంటున్నారు రాష్ట్రాని గమనిస్తున్న దేశ వ్యాప్త విశ్లేషకులు.

Image result for chandrababu using govt helicopter for private and public purposes

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనను తాను దేశ ప్రధానితో పోల్చుకోనవసరం లేదు. అది పెద్ద తప్పు కూడా దేశానికి సార్వ భౌమత్వం ఉంటుంది. రాష్ట్రం దేశంలో ఒక భాగం మాత్రమే. ప్రతి దానికి తాను దేశంలోనే సుధీర్ఘ అనుభవమున్న ముఖ్యమంత్రి అని చెప్పుకోవటం అత్యంత సిగ్గుమాలిన తనమే కాదు పరమ దుర్మార్గం కూడా! 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి 543 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్న సువిశాల భారత ప్రధానితో పోల్చుకోవటం ఎప్పతటికీ శ్రేయోదాయకం కాదు. దేశ ప్రధానికి అంతర్జాతీయ సంబంధాలు, దేశ రక్షణ, దేశ సమగ్రత తదితర బాధ్యతలు అవసరాలు కూడా ఉంటాయన్నది.


ధర్మపోరాటం న్యాయపోరాటం అంటూ జిల్లాల వారీగా చేసిన దుబారా గర్హనీయం. పలుమార్లు శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాలు, విపరీత ప్రచారాలకు చేసిన దుబారా ఆర్ధికంగా రాష్ట్రం నడ్డి విరిచింది. ఉద్యోగుల జీతభత్యాలు సైతం పడాకున బెట్టి ఆ ఫండ్స్ ను సంక్షేమ పథకాల పేరుతో (పసుపు కుంకుమ & వృద్ధాప్య పెన్షన్లు) ఎన్నికల ముందు పరోక్షంగా ఓట్లను కొనటానికి వినియోగించిన దౌర్భాగ్యం ఏపిలో మాత్రమే సంభవించింది.  

Image result for chandrababu using govt helicopter for private and public purposes

రెవెన్యూ లోటు భారీగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రెగ్యులర్‌ విమానాలున్న నగరాలకు కూడా ప్రత్యేక విమానాల్లో వెళ్లడాన్ని అధికారులు తప్పు పట్టారు. అయినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నికల ముందు ధర్మపోరాట దీక్షల పేరుతో పలు జిల్లాలకు వెళ్లారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల మధ్య ఉండాల్సిన గీతను చెరిపేశారు. విచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. చంద్రబాబు ఉపయోగించే ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌ కు గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేకంగా పార్కింగ్‌ కేటాయించారు.


ఈ పార్కింగ్‌ చార్జీలను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. అలాగే పైలెట్, ఇతర సిబ్బందికి స్టార్‌ హోటళ్ల లో బసకు అయ్యే చార్జీలను కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంది. గత ఐదేళ్లగా చంద్రబాబు ప్రత్యేక విమానాల కోసం ఖజానా నుంచి ఏకంగా ₹100 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రబాబు గారి ప్రత్యేక విమాన చార్జీలను చెల్లించేందుకు నాలుగు నెలల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కు మరో ₹10.36 కోట్లు విడుదల చేస్తూ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ  ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు

 Image result for chandrababu using govt helicopter for every small thing

మరింత సమాచారం తెలుసుకోండి: