చంద్రబాబునాయుడు మాటలు చూస్తుంటే అందరికీ అలాంటి అనుమానాలే వస్తున్నాయ్.  ఫణి తుపాను ఏపిలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని భయపడ్డారు. అయితే పెద్దగా ప్రభావం చూపకుండానే ఏపి తీరం దాటేసింది. తుపాను పరిస్ధితులపై సమీక్ష చేయటానికి చంద్రబాబు ఎంతో ప్రయత్నించారు. కానీ ఎన్నికల కోడ్ వల్ల సాధ్యం కాలేదు. అదే సమయంలో తుపాను ప్రభావంపై ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సమీక్షలు చేశారు.

 

చంద్రబాబు ప్రమేయం లేకుండానే తుపాను సహాయక చర్యలు జరిగిపోయాయి. అధికార యంత్రాంగంలో ఎక్కడా ఎటువంటి తడబాటు లేకుండా ప్రశాంతంగా పనులు జరిగిపోయాయి.  తనకు రావాల్సిన క్రెడిట్ ఎల్వీ కొట్టేశారని దుగ్ద చంద్రబాబులో పెరిగిపోయింది. దాన్నే చంద్రబాబు తట్టుకోలేకపోయినట్లు ఆయన మాటల్లో స్పష్టంగా అర్ధమైపోతోంది. దాంతో ఇటు ఈసిని అటు ఎల్వీని నోటికొచ్చినట్లు మాట్లాడారు. తుపానుపై సమీక్షలు చేసే అధికారాలను తనకు ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ రాసారు.

 

మొత్తానికి అన్నీ ప్రయత్నాల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. తీరా చంద్రబాబు సమీక్షలు చేద్దామని అనుకునే సరికి తుపాను ప్రభావం బలహీనపడిపోయింది. పెద్దగా నష్టం జరగకుండానే తీరం దాటేసింది. తుపాను తీరందాటే సమయంలో సమీక్షలు చేసేందుకు అనుమతిస్తుందా అంటూ మళ్ళీ ఈసిపై మండిపడ్డారు. చంద్రబాబు మాటలు విన్నవారికి తుపాను ప్రభావం తీవ్రంగా లేకపోవటం, భయపడినట్లుగా నష్టం జరగకపోవటంతో నిరాస చెందినట్లే కనిపించింది.

 

అపార నష్టం జరిగుంటే తాను సమీక్షలు చేయకపోవటం వల్లే అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేయలేకపోయిందని అనచ్చు. ఎల్వీ సమర్ధవంతమైన అధికారి కాదు కాబట్టే యంత్రాంగంతో సరిగా పనిచేయించలేకపోయారని, నష్టాలకు కారకులయ్యారని నిందించచ్చు. కోడ్ పేరుతో ఏపిలో అపార నష్టం జరగటానికి కారణమైందని ఈసీని తూర్పారబట్టచ్చని అనుకున్నట్లున్నారు.

 

ఎందుకంటే మొన్ననే పిడుగులు పడి ఏడుగురు మరణించారు. తాను సమీక్షలు చేయకపోవటం వల్లే పిడుగుపాటుకు ఏడుగురు మరణించారని మండిపడ్డారు. పిడుగులు పడటానికి, మరణించటానికి, చంద్రబాబు సమీక్షలకు ఏమన్నా సంబంధముందా ? ఐదేళ్ళలో రాష్ట్రంలో చాలాచోట్ల పిడుగులు పడి ఎంతో మంది చనిపోయారు. మరి అప్పుడు చంద్రబాబు సమీక్షలు చేసినా పిగుడుపాటుకు ఎల మరణించారు ? అంటే తనకు నచ్చని విషయాలపై ఏదో ఒకటి మాట్లాడటం, ఎదుటివారిపై బురదలు చల్లి అక్కసు తీర్చుకోవటం చంద్రబాబుకు బాగా అలవాటైపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: