క్రికెట్ బెట్టింగుల కంటే ఎక్కువగా ఈసారి ఎన్నికల బెట్టింగులు జోరందుకుంటున్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్నది అభ్యర్ధులు పార్టీలకే పరిమితం కావడంలేదు. బెట్టింగు రాయుళ్ళ బారిన పడి ఓడిన పార్టీతో పాటు పందేలు కాసిన వారు సైతం ఇంట్లో తడి గుడ్డ వేసుకుని కూర్చోవాల్సివస్తుంది. ఎంతగా కంట్రోల్ చేసినా కూడా ఈ  బెట్టింగులను ఎవరూ ఆపలేకపోతున్నారు.


ఇక కడపలో కాయ్ రాజా కాయ్ పందేలు గత కొన్ని రోజులుగా స్పీడందుకున్నాయట. కడపలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి. రాయచోటి, మైదుకూరు, జమ్మలమడుగులో ఎవరు విజయం సాధిస్తారు, పులివెందులలో జగన్ మెజారిటీ పెరుగుతుందా తగ్గుతుందా ఇలా చాల విషయాలపై పందేలు జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు. యాభై కోట్ల నుంచి ఇపుడు వంద కోట్లకు ఈ పందేలు పెరిగిపోయాయి. రానున్న రోజుల్లో ఈ మొత్తం రెండు వందల కోట్లకు పెరిగినా ఆశ్చర్యం లేదు 


ఇక ఏపీలో ఎవరు సీఎం అవుతారు అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారుట. సింగిల్ పార్టీతోనే అధికారంలోకి రావాలని, ఇతర పార్టీల మద్దతు తీసుకుని సీఎం అయితే అది పందెం గెలిచినట్లు కాదని నిబంధనలు కూడా ఉన్నాయట. ఇక జగన్ సీఎం అవుతారని పందెం కాస్తున్న వారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబు అవుతారని చెబుతున్న వారూ బాగానే  ఉన్నారట. గోదావరి క్రిష్ణా జిల్లాలకు చెందిన వారు సైతం పెద్ద ఎత్తున ఇక్కడకు వచ్చి పందేలు కాయడం విశేషం. మరి చూడాలి ఈ బెట్టింగుల్లో ఎవరు గెలుస్తారో.



మరింత సమాచారం తెలుసుకోండి: