తమ్ముడు పార్టీపై ఎన్నికల ముందు వరకూ పెద్దగా స్పందించని నాగబాబు అనూహ్యంగా నరసాపురం నుంచి ఆ పార్టీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిపోయారు. మొత్తం పదిహేను రోజుల పాటు పార్టీ ప్రచారం చేశారు. ఆయన గెలుపు ఓటములు పక్కన పెడితే ఎన్నికల అనంతరం జనసేనలో పవన్ యాక్టివ్ రోల్ తగ్గించేశారు. ఆయన పూర్తిగా విరామం మూడ్లో ఉన్నారు. అయితే జనసేన తరఫున రివ్యూస్ ప్రతీ జిల్లాల్లో నిర్వహిస్తున్నారు.


ఈ రివ్యూస్ కి నాగబాబు హాజరవుతూ క్యాడర్ కి ఫుల్ జోష్ ఇస్తున్నారు. ఆయన మొదట నరసాపురం నుంచి మొదలుపెట్టి ఇపుడు అన్ని జిల్లాలకూ హాజరవుతున్నారు. ఇక విశాఖతో పాటు ఉత్తరాంద్ర్హ రివ్యూస్ కి జనసేనాని పవన్  హాజరవుతారని చెప్పినా ఆయన ప్లేస్ లో నాగబాబు రావడం బట్టి చూస్తూంటే పార్టీలో నాగబాబు నంబర్ టూ అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. నిజానికి నాగబాబు ఎంట్రీ ముందు వరకూ పవన్ పక్కన నాదెండ్ల మనోహర్ ఉండేవారు. ఆయనకు ముందు మరికొందరు ఉండేవారు.


ఇపుడు మాత్రం నాగబాబు పార్టీలో పవన్ తరువాత అన్నట్లుగా సీన్ మారుతోంది. గాజువాక రివ్యూలో నాగబాబు హాట్ కామెంట్స్ వైసీపీ మీద చేయడమే కాదు. పవన్ని ఆకాశానికి ఎత్తేశారు. పార్టీ శాశ్వతంగా జనంలో ఉంటుందని, బలమైన పునాది పవన్ వేశారని నాగబాబు చెప్పుకొచ్చారు. తన తమ్ముడికి ఏ టెన్షన్ లేదని, మిగిలిన పార్టీలకు పదవుల టెన్షన్ ఎక్కువని నాగబాబు సెటైర్లు వేసి మరీ క్యాడర్లో జోష్ నింపారు దీన్ని బట్టి చూస్తూంటే పవన్ అన్న హోదాలో నాగబాబుకు అన్నీ ప్లస్సులే  పార్టీలో ఉన్నాయని, ఆయన జనసేనాని తరువాత ప్లేస్ లో ఉంటారని టాక్ నడుస్తోంది. మరి ఈ పరిణామం ఎటు దారితీస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: