ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా సమయం ఉంది. ఈలోగా చేసేది కూడా ఏమీ ఉండదు. అధికారం చేతికి అందినా.. అందకపోయినా.. మళ్లీ ఇంత ఖాళీ  దొరకదు. అందుకే వైఎస్ జగన్ లండన్ వెళ్లాలని డిసైడ్ అయ్యారు. శుక్రవారం వెళ్లి ఈనెల 12న మళ్లీ తిరిగి రావాలని ప్లాన్ చేశారు. 


అయితే అనుకోకుండా జగన్ టూర్ వాయిదా పడింది. ఇందుకు కారణాలు కూడా తెలియరాలేదు. కానీ.. ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలే ఈ టూర్ రద్దుకు ఓ కారణమై ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏపీ సీఎం ఏమన్నారు.. జగన్ టూర్ పై చంద్రబాబు కామెంట్ ఏంటి.. ? 

ఫోని తుపాను నేపథ్యంలో చంద్రబాబు జగన్ పై సెటైర్లు వేసారు. గతంలో తుఫాన్ వచ్చిదంటే బాధితులకు న్యాయం చేయాలని ధర్నాలు చేసేవాళ్లు. ఇప్పుడు ప్రతిపక్షాలు విదేశాలు వెళ్లే పరిస్థితి వచ్చిందంటూ వెటకారం ఆడారు. ఇక్కడున్నా చేసేదేం లేదన్న ఉద్దేశంతో వారు ఫారెన్ టూర్ వెళ్తున్నారు.. అని స్పందించారు. 

దీనికి తోడు .. తుఫాన్ భయం వణికిస్తున్న సమయంలోనే జగన్ హైదరాబాద్‌లోని మహేష్ బాబుకు చెందిన సినిమా ధియేటర్‌లో అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకు వెళ్లారు. దీనిపైనా సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. సో.. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ తీరుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడంతో.. ఇప్పుడు టూర్‌కు వెళ్లడం తప్పుడు సంకేతాలు ఇచ్చేందుకు ఆస్కారమిస్తుందన్న కారణంతో జగన్ లండన్ టూర్ వాయిదా వేసుకున్నట్టు భావిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: