ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా ఘోరమైన విమాన ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.  అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లేలో ఉన్న నేవల్ ఎయిర్ స్టేషన్ లో ల్యాండ్ అయిన సందర్భంలో రన్ వే చివరకు వెళ్లిపోయిన విమానం ఆ పక్కనే ఉన్న సెయింట్ జాన్స్ నదిలోకి దూసుకుపోయింది.  అదృష్టం కొద్ది ఆ విమానంలో ప్రయాణిస్తున్న 136 మంది ప్రయాణీకులు ప్రాణాలతో బయట పడటంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.  కాకపోతే కొద్ది మంది  మాత్రం గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న నావికాదళ సిబ్బంది సహాయకచర్యలను ప్రారంభించింది. మరోవైపు, విమానంలోని ఇంధనం నదిలోకి లీక్ అవ్వకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.  క్యూబాలోని గ్వాంటనమో బే నేవల్ స్టేషన్ నుంచి ఈ విమానం బయల్దేరింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.40 గంటలకు విమానం నదిలోకి దూసుకుపోయింది. 

బోయింగ్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ప్రమాదానికి సంబంధించి సమాచారాన్ని తెప్పించుకుంటున్నామని తెలిపారు. అయితే జాక్సన్ విల్లే మేయర్ మాట్లాడుతూ.. విమానం నీటిలో మునగకపోవడంతో, అందులో ఉన్నవారంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: