జనసేన తరపున నరసాపురంలో పార్లమెంటుకు పోటీ చేసిన నాగేంద్రబాబు @ నాగుబాబు ఓటమి ఖాయమైందా ?  నాగుబాబు తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అందరిలోను అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్నటి మేడే రోజు విశాఖపట్నంలో కార్యకర్తలతో నాగుబాబు, జేడి లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు లేండి. ఆ సందర్భంగా ప్రత్యర్ధులపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. ప్రత్యర్ధులపై అకారణంగా తిట్ల దండకం ఎత్తుకున్నారంటేనే నాగుబాబులో ఓటమి అక్కసు స్పష్టంగా కనిపిస్తోందని అర్ధమైపోతోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, తన తమ్ముడు, జనసేన అధినేత  పవన్ కల్యాణ్ ను విమర్శించినోళ్ళంతా అడ్డగాడిదలు, పనికిమాలిన సన్నాసులు, వెధవలు, రాస్కెల్స్ అట. ప్రత్యర్ధి పార్టీల తరపున ప్రచారం చేసిన నటులంతా పెయిడ్ ఆర్టిస్టుగాళ్ళట. తన తమ్ముడిని తాను పొగుడుకోవటంలో తప్పేమీ లేదు. ఇతరులకన్నా పవన్ చాలా గొప్పోడని అనుకోవటంలో కూడా నష్టమేమీ లేదు. కానీ ప్రత్యర్ధులను ఎందుకింతగా దూషించాల్సి వచ్చింది ?

 

ఎందుకు దూషించారంటే ఓటమి అక్కసే అని స్పష్టమవుతోంది. ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం ఉంటే ఎదుటి వారి గురించి అంతలా నోరు పారేసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాలన్నా ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు సహజమే. అంత మాత్రాన పవన్ ను విమర్శించకూడదు, ఆరోపణలు చేయకూడదంటే కుదరదు. ఎందుకంటే, పవన్ కూడా జగన్మోహన్ రెడ్డిని పదే పదే టార్గెట్ చేసుకుని విమర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 

సరే ఎన్నికలు కూడా అయిపోయాయి. కానీ హఠాత్తుగా ఇపుడు ప్రత్యర్ధులపై నోరు పారేసుకోవాల్సిన అవసరం లేదు. నరసాపురం పార్లమెంటుకు నాగుబాబు జనసేన తరపున పోటీ చేశారు. అదే పార్లమెంటు పరిధిలోని భీమవరం అసెంబ్లీకి పోటీ చేశారు. ఇద్దరి గెలుపు కష్టమనే ప్రచారం జరుగుతోంది. బహుశా అదే నిజం కావచ్చు లేదా కాకపోవచ్చు.

 

ఓడిపోతామన్న అక్కసుతోనే నాగుబాబు ప్రత్యర్ధులపై నోరు పారేసుకుంటున్నారన్న విషయం అర్ధమైపోతోంది. 140 అసెంబ్లీలకు, 25 పార్లమెంటుకు పోటీ చేసిన జనసేన ఎక్కడ గెలుస్తుందంటే ఒక్కస్ధానం కూడా చెప్పలేరు. ఇవన్నీ చూసిన తర్వాత ఓటమి ఫీడ్ బ్యాక్ ను చూసుకున్న తర్వాతే నాగుబాబులో ఉక్రోషం కట్టలు తెంచుకున్నట్లు జనసేనలోనే చర్చ జరుగుతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: