ఈస్ట‌ర్ ప‌ర్వ‌దినాన శ్రీలంక‌లో వ‌రుస బాబు పేలుళ్లు అట్టుడికించిన విష‌యం తెలిసిందే. వ‌రుస బాంబు పేలూళ్ల‌తో లంక దేశం మొత్తం అట్టుడికింది. వంద‌ల సంఖ్య‌ల్లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్య‌లో గాయ‌ప‌డ్డారు. అయితే ఆ బాంబు దాడులు ఇప్పుడు భాత‌ర్‌లో ప్ర‌మాద గ‌డియ‌ల‌ను హెచ్చ‌రిస్తున్నాయి. భార‌త్‌లో కూడా ఐసిస్ దాడులు జరుగొచ్చ‌ని ఈస్ట‌ర్ ఆత్మాహుడి దాడులు స్ప‌ష్టం వెల్ల‌డిస్తున్నాయి. 


అయితే శ్రీలంక‌లో దాడుల‌కు పాల్ప‌డిన వారు శిక్ష‌ణ కోసం కాశ్మీర్‌, కేర‌ళకు వ‌చ్చి వెళ్లిన‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ఒక క‌థ‌నం ద్వారా వెల్ల‌డించింది. ఇదే విష‌యాన్ని లంక‌కు చెందిన లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ మ‌హేశ్ సేన‌నాయ‌క్‌కే వెల్ల‌డించిన‌ట్లు పేర్కొంది ఆ సంస్థ‌. ఈ నేప‌థ్యంలో శ్రీలంక బాంబ‌ర్ల‌కు భార‌త్‌లో పెద్ద ఎత్తున లింకులున్నాయ‌ని పేర్కొన‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్‌. 


బాంబ‌ర్లు భారత్‌కు వెళ్లి.. ఆ దేశంలోని కాశ్మీర్‌, కేర‌ళ‌, బెంగ‌ళూరులో ఉన్న‌ట్లు త‌మ వ‌ద్ద స‌మాచారం ఉంద‌ని సేనానాయ‌క్ తెలిపారు. వారు శిక్ష‌ణ కోసం వెళ్లి ఉండొచ్చ‌ని పేర్కొన్నారు. అలాగే ఇత‌ర గ్రూపుల‌లతో పెద్ద ఎత్తున సంబంధాలు పెంచుకొనే అవ‌కాశం కూడా లేక‌పోలేద‌ని సేననాయ‌క్ వెల్ల‌డించారు. 
ఆ క‌థ‌నంపై భార‌త్ స్పందించింది. చాలా జాగ్ర‌త్త‌గా స‌మాధానం చెప్పారు కేంద్ర హోం శాఖ‌కు చెందిన అధికారి. శ్రీలం ఇప్ప‌టివ‌ర‌కు బాంబా దాడుల‌కు సంబంధించి గానీ, ఉగ్ర‌వాదుల గురించి గానీ ఎలాంటి విష‌యం మాతో షేర్ చేసుకోలేద‌ని చెప్పారు.

ఆ దేశ సెక్యూరిటీ సంస్థలు ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు వెల్ల‌డించాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం భార‌త నిఘా వ‌ర్గాలు, ద‌ర్యాప్తు సంస్థ‌లు కూడా దీనిని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నాయి. అయితే కొన్నాళ్ల క్రితం కేర‌ళ‌, త‌మిళ‌నాడుల్లో దాడులు నిర్వ‌హించిన ఇస్లామిక్ స్టేట్‌కు సంబంధించి వ్య‌క్తులు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వారి విచారింగా.. 2017లో శ్రీలంక బాంబర్లలో ఇద్దరు భారత్‌కు వచ్చినట్లు ఫ్రూవ్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: