భారత దేశం అగ్ర ప్రపంచాలతో పోటీ పడుతుంది. మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుంది..మారు మూల గ్రామాలు కూడా ఇప్పుడు చైతన్యవంతులు అవుతున్నారు.  పల్లె పట్టణాలవుతున్నాయి..చిన్న చిన్న గ్రామాల్లో సైతం టెక్నాలజీ అభివృద్ది చెందుతుంది.  మా ప్రభుత్వ హయాంలో ఏ గ్రామంలో చిన్న ఇబ్బందులు లేవు...కరెంటు , రవాణా వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందుతుంది..అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు కొంత మంది నేతలు.  కానీ నిజానికి వీరు అంటున్న వంద శాతంలో కనీసం పది శాతం కూడా పల్లె ప్రాంతాల్లో కనిపించవు. 


దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరోగ్యానికి సంబంధించిన సరైన వసతులు కూడా ఎక్కడా లేవంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది మన ఆరోగ్య వ్యవస్త పనితీరు..దేశంలో మారు మూల ప్రాంతాలకు వెళ్లాలంటే సరైన వసతులు లేక ప్రజలు ఎన్న అవస్థలు పడుతున్నారో పాలకులకు తెలియదు. తాజాగా సరైన రోడ్డు వ్యవస్థ లేక  ఓ మృత దేహాన్ని ఆరు..ఏడు  కిలో మీటర్లకు ఎక్కువగా మోసుకుంటూ తీసుకువెళ్లిన ఘటన  విశాఖ ఏజెన్సీలో జరిగింది. వివరాల్లోకి వెళితే..విశాఖ ఏజెన్సీలో  కొయ్యూరు మండలం గరిమండకు చెందిన మర్రి సర్వేశ్వరరావు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించాడు.  


అతని బంధువులు మృతదేహాన్ని శుక్రవారం నేరెళ్లబంద వరకు ‘ప్రజాప్రస్థానం’లో తీసుకువచ్చారు. అక్కడి నుంచి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో చేసేదేమీలేక డ్రైవర్‌ వాహనాన్ని నిలిపివేశాడు. దాంతో మృతదేహాన్ని నేరెళ్లబంద నుంచి గరిమండ వరకు ఆరు..ఏడు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ మోసుకెళ్లారు. కాగా,  రోడ్డు వ్యవస్థ సరిగా ఉంటే.. ఉంటే ‘ప్రజాప్రస్థానం’ వాహనం తమ గ్రామానికి నేరుగా వచ్చి ఉండేదని మృతుడి బంధువులు చెప్పారు. అధికారులు స్పందించి వెంటనే తమ గ్రామానికి రోడ్డు వెయ్యాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ అనేక గ్రామాలున్నాయని ,అక్కడా ఇలాంటి పరిస్థతి వస్తే 15 కిలోమీటర్లకు పైగా మృతదేహాలను మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: