రేపటి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అంతుబట్టడంలేదు. పేరుకు రాజకీయంగా తలపండిన వారు అని చెప్పుకోవడమే తప్ప ఎవరూ వూహించలేకపోతున్నారు. ఓ వైపు భారీ పోలింగ్ ఆశలూ పెడుతోంది. ఆయాసాన్ని తెప్పిస్తోంది. దీని వల్ల లాభమా నష్టమా అన్నది కూడా పెద్ద డౌటే. మరో వైపు జనసేనను తక్కువ అంచనా వేసినా చికాకేనని స్వయంగా తమ్ముళ్ళే నిజం ఒప్పుకుంటున్నారుట.


ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం ఎంపీ సీటు పరిధిలో పోలింగ్ సరళిపై చంద్రబాబు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో బాబు సైతం నివ్వెరపోయే నిజాలను తమ్ముళ్ళు చెప్పారుట. మనమే గెలిచేస్తున్నామని  ఓ వైపు పెద్ద నాయకులు వూదరగొడుతూంటే ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన సైలెంట్ వేవ్ నడించిందన్న చేదు నిజాన్ని ఎంపీ మురళీమోహన్ కోడలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్ధి మాగంటి  రూప బాబు ద్రుష్టికి తెచ్చారుట. జనసేన గణనీయంగా ఓట్లు చీల్చిందని, ఆయితే ఆ ఓట్లు ఏ పార్టీవో తెలియదంటూ ట్విస్ట్ ఇస్తూ మరీ  ఆమె చెప్పుకొచ్చిందని టాక్.


అయితే గత ఎన్నికల్లో జనసేన టీడీపీ వైపు ఉంది. పవన్ పోటీ చేయకుండా టీడీపీకి మద్దతుగా నిలిచారు. దాంతో కాపులంతా సైకిల్ కి ఓటేశారు. ఇపుడు మాత్రం పవన్ వేరుపడి పోటీకి దిగారు. దాంతో ఆయన ఓట్లు ఆయన చీల్చుకున్నా ఆ నష్టం మాత్రం టీడీపీకేనని తొలి  అంచనాకు ఇపుడు పసుపు నాయకులు  వచ్చేస్తున్నారుట. పోలింగ్ సరళి గురించి బాబు ఏర్పాటు చేసిన తొలి మీటింగులోనే తూర్పు తిరిగి దండం పెట్టేలా తమ్ముళ్ళు నిజాలు కక్కేయడంతో ఎన్ని సీట్లు ఈసారి వస్తాయోనన్న టెన్షన్  టీడీపీ హై కమాండ్ కి  బాగా ఎక్కువగా పట్టుకుందని ఇన్నర్ సర్కిల్స్ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: