రాజకీయ నాయకుల నుంచి ప్రజలు మాటల కంటే చేతలు ఎక్కువగా కోరుకుంటారు. అయితే ఇటీవల కాలంలో మీడియా మితిమీరిన జోక్యం వల్ల చాలా మంది నాయకులు ఎపుడు బుల్లి తెర మీదనే కనిపిస్తున్నారు. కొంతమంది నాయకులు మీడియా బేబీలుగా పేరు తెచ్చుకున్నారు కూడా.  అయిన దానికీ కాని దానికీ మీడియా ముందుకు వస్తూ హడావుడి చేయడం నేతాశ్రీలకు బాగా  అలవాటుగా మారిపోతోంది. చేసింది తక్కువ, మాటలు ఎక్కువ అని జనం కూడా అనుకునే పరిస్థితి ఉంది.


ఈ పరిస్థితుల్లో జగన్ కనుక ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇపుడు ఓ చర్చగా సాగుతోంది. జగన్ పదేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అవసరానికి మించి ఎపుడూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. ఎంతటి కీలకమైన విషయమైనా పార్టీలోని సీనియర్ నాయకులతో చెప్పిస్తారు తప్ప జగన్ మాత్రం రారు. ఇక తాను మాట్లాడాల్సిన విషయాలు అయితేనే జగన్ కనిపిస్తారు. ఇలా లో ప్రొఫైల్ మైంటైన్ చేయడం జగన్ కి ముందు నుంచి అలవాటు అటువంటి జగన్ సీఎం అయితే ఆయన మీడియా ముందుకు రావడం చాలా అరుదుగా మారుతుందని అంచనా వేస్తున్నారు.


జగన్ తన తండ్రి వైఎస్ బాటన పయనిస్తారని కూడా చెబుతున్నారు. వైఎస్ అధికారులతో  రివ్యూ మీటింగులు పెద్దగా పెట్టేవారు కాదు. పెట్టిన మీటింగుల్లో కూడా పట్టుమని పది నిముషాలకు మించి మాట్లాడేవారు కాదు. అధికారులను వారి పని వారు చేసుకోనిచ్చెవారు. రోజు మీటింగులు, రివ్యూలు అంటూ విసిగించడం వైఎస్ కి నచ్చేది కాదు జగన్ కూడా అచ్చం అలాగే ఉంటారని అంటున్నారు. ఆయన చెప్పదలచుకున్నది చెప్పేసి అధికారుల మీద నమ్మకం ఉంచుతారని, వర్క్ క‌ల్చర్ ని నమ్ముతారు తప్ప ఉత్త మాటలను కాదని అంటున్నారు.


తెలంగాణాలో కేసీయార్ కూడా ఇదే విధానం అనుసరిస్తున్నారు. ఆయన సైతం బ్రహ్మాండం బద్దలైతే తప్ప మీడియామీటింగు పెట్టరు. అలాగే అధికారులను ఎక్కువగా రివ్యూ మీటింగుల పేరిట విసిగించరు. జగన్ కూడా రేపటి రోజున అలాగే ఉంటారని అధికారుల్లో కూడా చర్చ సాగుతోంది. చంద్రబాబు విధానానికి ఇది పూర్తి భిన్నం. ఓ విధంగా మాటల కంటే చేతలు ముఖ్యం. మరి ఆ విధంగా జగన్ పని చేసి చేయించగలిగితే జనంలో పేరు రాకుండా ఉంటుందా. రోజు మీడియాలో కనబడితేనే జనంలో ఉంటామనుకోవడం తప్పు అన్నది అనేక సార్లు రుజువు అయిన వేళ జగన్ నా రూటే సెపరేట్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: