వైవీ సుబ్బారెడ్డి .. ఎస్సార్సీపీలో జగన్ తరువాత తానే అని చెప్పుకొని తిరిగాడు. అయితే మారిన పరిస్థితుల వల్ల సుబ్బారెడ్డి పార్టీ టిక్కెట్ కూడా దక్కలేదు. జగన్‌కు సమీప బంధువైన వైవీ సుబ్బారెడ్డి కొన్ని నెలల క్రితం వరకు వైసీపీలో ప్రముఖ పాత్ర పోషించారు. పార్టీలో జ‌గ‌న్ త‌ర్వాత ఆయ‌నె అన్నీ తానై న‌డిపారు.ఎన్నికలకు కొద్దివారాల ముందు జరిగిన పరిణామాలతో వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి పరిస్థితి ఏమిటనే దానిపై ఆయన అనుచరుల్లో సందేహాలు నెలకొన్నాయి.


ఒంగోలు ఎంపీగా మ‌రోసారి పోటీ చేయాల‌ని భావించిన సుబ్బారెడ్డి ఆశ‌ల‌కు జ‌గ‌న్ నీల్లు చ‌ల్లారు. టీడీపీనుంచి వైసీపీలోకి వ‌చ్చిన మాగుంట శ్రీనివాసుల‌రెడ్డికి జ‌గ‌న్ ఎంపీ టికెట్ ఇచ్చారు. అప్ప‌టినుంచి సుబ్బారెడ్డి అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఎంపీ సీటు ఇవ్వ‌క‌పోయినా పార్టీ అధికారంలోకి వ‌స్తె ఏదో పదవిపై హామీ ఇస్తారని అంతా అనుకున్నారు. పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు బాలినేని శ్రీనివాసుల‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డంతో వైవీ సుబ్బారెడ్డికి ఏ మాత్రం మింగుడుపడలేదనే వాదన ఉంది.


దీంతో లోట‌స్ పాండ్‌కు సుబ్బారెడ్డి దూరంగా ఉంటున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.పార్టీ కోసం కొన్నేళ్ల పాటు శ్రమించిన తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఏమిటని ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు సమాచారం. జ‌గ‌న్ మ‌ళ్లీ పిలిస్తేనె తాను పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటాన‌ని త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకున్న‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: