ఏపీలో ఎన్నికల కోలాహలం అయ్యిపోయింది.ప్రస్తుతం అన్ని పార్టీలు, ఏపీలోని అశేష ప్రజలు సైతం వేచి చూస్తున్న ఏకైక అంశం మే 23 న రానున్న రిజల్స్. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని ఇప్పటికే అంచనాలు వేసేశారు రాజకీయ పండితులు. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత త్వరలో ప్రతిపక్ష అధినేతగా కూర్చోనున్నారనే కామెంట్స్, విశ్లేషణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే

 Image result for janasena pawan kalyan

మొదట్లో ఎంతో జోరుమీద ఉన్న జనసేన పార్టీ ఎన్నికల అనంతరం స్పీడు తగ్గించింది. వార్ వన్ సైడ్ అని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తేలు కుట్టిన దొంగలా ఎన్నికల రిజల్స్ తరువాత జరగబోయే పరిణామాల మీద సమీక్షలు చేస్తున్నాడట. ఒక పక్క ఏ మీటింగ్ పెట్టకపోతే పార్టీ మూసేస్తారా అని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అనే భయంతో, జనసేన పార్టీ యాక్టివ్ గా ఉందని మీడియాలో తెలియచేయడానికి మధ్య మధ్యలో అభ్యర్ధులు, కొంతమంది నేతలతో సమీక్షలు జరుపుతున్నారని అంటున్నారు పరిశీలకులు. అయితే

 

ఎన్నికలు ముగిసిన రోజు మొదలు ఈ రోజు వరకూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు గానీ, పవన్ అభిమానులు కానీ ఎవరూ కూడా ఆయా నియోజకవర్గాల కొంతమంది అభ్యర్ధుల విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. ఎన్నికల సమయంలో తాము పార్టీ కోసం, అభ్యర్ధి గెలుపుకోసం స్థానికంగా ఉన్న నేతలని సైతం ఎదిరించి పోరాడి జనసేనకి కొమ్ము కాస్తే ఇప్పుడు అభ్యర్ధులు ముఖాలు చాటేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారట. అంతేకాదు సోషల్ మీడియాలో , వాట్సప్ గ్రూప్స్ లో మన ఎమ్మెల్యే అభ్యర్ధి గారు కనిపించడం లేదు ఎక్కడైనా ఉంటే వెతికి పట్టుకోండి అంటూ వెటకారం చేస్తున్నారట. అయితే

 Image result for janasena fans

ఎన్నికల తరువాత వారం వరకూ అందుబాటులోనే ఉన్న అభ్యర్ధులు, పార్టీ నేతలు, జనసేన కనీసం 5 సీట్లు అయినా సరే గెలుచుకుంటుందా అనే సందేహాలు వ్యక్తం చేయడంతో ఒక్క సారిగా సైలెంట్ అయ్యిపోయారట. పార్టీ కార్యకర్తల ఫోన్ లకి సైతం అందుబాటులో ఉండటం లేదట. స్థానికంగా ప్రధాన పార్టీల నేతలు బెదిరింపులు ఒక పక్క కొనసాగుతున్న నేపధ్యంలో తమకి నియోజకవర్గంలో అండగా ఉండే జనసేన నేతలు లేక ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. దాంతో పార్టీ ఆవిర్భావం నుంచీ ఎవరైతే పార్టీని భుజాన మోసుకుని నడిచారో వారే పార్టీకి దూరం అవుతున్నారట. ఈ పరిస్థితులని గమనించిన పార్టీ అధిష్టానం, పార్టీ కార్యకర్తలు, నేతలకి ఎవరెవరు అందుబాటులో ఉండటంలేదు, స్పందించడం లేదు అనే వివరాలని తెప్పించుకున్నారని, కార్యకర్తలు పడుతున్న ఆందోళనలో వాస్తవం ఉందని తెల్చారట. దాంతో జనసేన పార్టీలో సైతం ఈ పరిస్థితిపై ఆందోళన కలుగుతోందని అంటున్నారు. ఇదిలాఉంటే ఇదే  పరిస్థితి  గనుక కంటిన్యూ అయితే జనసేనలో సేనాని తప్ప సైన్యం  ఉండరు అంటున్నారు విశ్లేషకులు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: