తెలంగాణలో మరో పత్రిక మూతపడుతోందట. అట్టహాసంగా ప్రారంభించినా ఆశించిన రీతిలో నడవని ఆ పత్రికను త్వరలోనే మూసేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఉద్యోగులకు ముందస్తుగా సమాచారం ఇచ్చిందట. ఇంతకీ ఆ పత్రిక ఏంటంటారా.. విజయక్రాంతి దిన పత్రిక.


గతంలో నమస్తే తెలంగాణ పత్రికను ప్రారంభించిన సీఎల్‌ రాజమ్‌ ఆ తర్వాత కాలంలో దాన్ని కేసీఆర్ కుటుంబానికి అప్పగించాల్సి వచ్చింది. ఆ తరవాత ఆయన తన సొంత మార్క్ చూపించేందుకు విజయ క్రాంతి పత్రికను ప్రారంభించారు. ఇటీవలి కాలంలో సొంత ప్రెస్ తో ప్రారంభమైన పత్రిక ఇదే అని చెప్పొచ్చు. 


సొంత ప్రెస్ కూడా ఉన్నందువల్ల కొన్నాళ్లు ఈ పత్రిక నడుస్తుందని ఆ పత్రిక సిబ్బంది ఆశించారు. కానీ పత్రికను మూసేయాలని నిర్ణయించుకున్నారట సీఎల్ రాజమ్. నమస్తే తెలంగాణ తర్వాత ఈయన మెట్రో అనే ఇంగ్లీషు పత్రిక కూడా తీసుకొచ్చారు. 

కానీ అది కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. సీఎల్ రాజమ్ ఇలా వరుసగా పత్రికలు ప్రారంభించడం, మూసేయడంపై పాత్రికేయ వర్గాల్లో విమర్శలు వస్తున్నాయి. నిలకడగా పది కాలాలు పత్రిను నడిపే ఉద్దేశ్యం, తపన లేకుండా ఇలా చేయడం జర్నలిస్టుల జీవితాలతో ఆడుకోవడమే అన్నది వారి ఆవేదన. అంతేగా. అంతేగా.



మరింత సమాచారం తెలుసుకోండి: