సినిమాలు, రాజకీయాలు, ఆటలు.. ప్రజలకు ఎక్కువగా ఆకర్షించే వాటిలో ఈ మూడు ముందుంటాయి. అందుకే ఈ విషయం చెప్పినా.. ఈ మూడు లింక్ చేస్తూ చెబితే బాగా కనెక్టవుతుంది.. ఇప్పడు ఏపీ రాజకీయాల విషయంలో ఇదే జరుగుతోంది. ఎన్నికల తర్వాత పరిస్థితిపై సోషల్ మీడియాలో కొన్ని తమాషా మెస్సేజులు భలేగా ఉంటున్నాయి. 


వాటిలో ఇది ఒకటి.. మీరూ చదవండి.. 

"ప్రయత్నిస్తూ చనిపోతే భీమిలి కబడ్డీ జట్టు
 చనిపోతాడని తెలిసి కూడా ప్రయత్నిస్తే జెర్సీ 
చనిపోయిన కూడా ప్రయత్నిస్తే అది  ఈగ
గెలవదు అని తెలిసి కూడా గెలుస్తాం అని నమ్మకం కల్పించే పార్టీ టీడీపీ
గెలుస్తాం అని తెలిసి కూడా ప్రజల పట్ల భక్తితో ఉండేది  వైస్సార్సీపీ
గెలిచిన గెలవకపోయిన పెద్ద ఫీల్ అవ్వనిది జనసేన
ఎందుకు పోటీ చేస్తున్నామో తెలియని బీజేపీ
ఎండి పోయాక కూడా వెలిగిపోతున్నాం అనుకునేది కాంగ్రెస్
అసలు ఒక్కసారి పోటీ చేయక పోయిన అధికారంలోకి వస్తే తాట తీస్తా అనేవాడు KA పాల్

బహుశా ఇది వైసీపీ సోషల్ మీడియా కానీ .. ఆ పార్టీ సానుభూతి పరులు కానీ తయారు చేసి ఉంటారు. కానీ దీన్ని చూస్తే ఎల్లో సేనలు ఊరుకుంటాయి. దాన్నే కాస్త అంటూ ఇటూ మార్చి మళ్లీ సోషల్ మీడియాలో వదలుతున్నాయి.. ఎల్లో సేనల మెస్సేజ్ ఇలా ఉంది..

ప్రయత్నిస్తూ చనిపోతే భీమిలి కబడ్డీ జట్టు
చనిపోతాడని తెలిసి కూడా ప్రయత్నిస్తే జెర్సీ 
చనిపోయిన కూడా ప్రయత్నిస్తే అది ఈగ
గెలవదు అని తెలిసి కూడా గెలుస్తాం అని నమ్మకం కల్గించేది వైస్సార్సీపీ
గెలుస్తాం అని తెలిసి కూడా భయపడుతూ ఉండేది టీడీపీ
గెలిచిన గెలవకపోయిన పెద్ద ఫీల్ అవ్వనిది జనసేన
ఎందుకు పోటీ చేస్తున్నామో తెలియనిది బీజేపీ
ఎండి పోయాక కూడా పచ్చగా చిగురొస్తుంది అనుకునేది కాంగ్రెస్
అసలు పోటీ చేస్తున్నామో లేదో తెలియకపోయినా, గెలిచి తాట తీస్తా అనేది ప్రజాశాంతి పార్టీ.

ఇదీ ఈ తమషా సందేశాల కథ. ఈనెల 23 వరకూ ఇలాంటి సోషల్ మీడియా వార్ తప్పదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: