కాంగ్రెస్ పార్టీ నేత‌, మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి త‌న దూకుడుతో  ఇర‌కాటంలో ప‌డ‌నున్నారా? ఇటీవ‌ల తిరిగి యాక్టివ్ అయిన రేవంత్ రెడ్డి మ‌ళ్లీ త‌న‌దైన శైలిలో చేస్తున్న కామెంట్ల వ‌ల్ల ఇబ్బందుల పాలు కానున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇంట‌ర్ ఫ‌లితాల్లో నెల‌కొన్న గంద‌ర‌గోళం, ఇత‌ర‌స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు గ్లోబరీనా సంస్థకు సంబంధం ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై పోలీసులు పిటిష‌న్ న‌మోదు చేశారు. 


టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు గ్లోబరీనా సంస్థకు సంబం ధం ఉందని రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణల‌ను తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ఖండించింది. రాష్ట్రంలో పాలన సవ్యంగా సాగుతుండటాన్నిచూసి ఓర్వలేకే ఇంటర్ ఫలితాలపై ప్రతిపక్షాలు దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నాయని  ఆరోపించింది. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలుచేసిన రేవంత్‌రెడ్డిపై సెక్షన్ 504, 505, 34 కింద కేసులు నమోదు చేయాలని న్యాయవాదులు బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ పీ సుబ్బయ్యకు ఫిర్యాదుపత్రాన్ని అందజేశారు. ప్రతిపక్షాలకు ఎలాంటి అంశాలు లేకపోవడంతోనే ఇంటర్ ఫలితాల అంశాన్ని రాజకీయంచేస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను రెచ్చగొడుతున్నాయని గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. వ్యక్తిగత ఎదుగుదల కోసం రేవంత్‌రెడ్డి.. ఇంటర్ ఫలితాల్లో దొర్లిన తప్పులతో ప్రభుత్వానికి, కేటీఆర్‌కు సంబంధం లేనప్పటికీ నిరాధారంగా రాద్దాం తం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.


ఫిర్యాదు ప‌త్రాన్ని స్వీక‌రించిన ఎస్ఐ రేవంత్‌పై ఫిర్యాదు విష‌యాన్ని ప‌రిశీలిస్తామ‌న్నారు. ఒక‌వేళ‌, రేవంత్ వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌కరంగా ఉంటే, ఆయ‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు అవుతుందంటున్నారు. తన‌ దూకుడు వ‌ల్ల మ‌ళ్లీ రేవంత్ ఇబ్బందుల పాల‌వుతున్నార‌ని పలువురు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: