ఈత స‌ర‌దా నెల్లూరు జిల్లాలో ఇద్ద‌రు బాలిక‌ల ప్రాణం తీసింది. క‌డ‌ప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ప్ర‌స‌న్న‌, మంజూల అనే ఇద్ద‌రు బాలిక‌లు వేస‌వి సెల‌వుల‌కు సోమ‌శిల‌లోని వారి బంధువ‌ల ఇంటికి వెళ్లారు. అయితే వారు మ‌ధ్యాహ్న స‌మ‌యంలో సోమ‌శిల జ‌లాశ‌యానికి వ‌చ్చారు. స‌ర‌దాగా ఈ కొట్టాల‌నుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఈత కొట్లాల‌ని చెరువులోకి దిగారు. 


అయితే చెరువులో బుర‌ద ఎక్కువ‌గా ఉంది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించని ఆ ఇద్ద‌రు చెరువులోకి దిగారు. బుర‌ద ఎక్కువ‌గా ఉండ‌డంతో ఈత కొట్టేందుకు వీలు కాలేదు. దీంతో బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్రయ‌త్నించారు. కానీ వారి వ‌ల్ల క‌లేదు. నీటిలోనే మునిగి చ‌నిపోయారు. నీటి ఉధృతి ఎక్కువ‌గా ఉండ‌డంతో కొట్టుకుపోయారు. త‌ర్వాత గ‌జ ఈత‌గాళ్లతో వారి మృత‌దేహాల‌ను వెలికి తీశారు. 


మ‌రోవైపు ఇటు క‌ర్నూలు జిల్లాలో కూడా ఈత స‌ర‌దాకు ఇద్ద‌రు బ‌ల‌య్యారు. దీంతో జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిల్ల‌ల ఈత స‌ర‌దా ఇద్ద‌రి ప్రాణాల‌ను బ‌లిదీసుకుంది. గోనెగండ్ల మండ‌లం న‌రుడుప్ప‌ల‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్ర‌కాశం, మ‌ల్లిఖార్జున అనే ఇద్ద‌రు బాల‌లు త‌న స్నేహితుల‌తో క‌లిసి గాజుల‌దిన్నె ప్రాజెక్టులో ఈత కొట్టేందుకు వెళ్లారు. 


స్నేహితులంద‌రూ క‌లిసి ప్రాజెక్టులోకి దిగి ఈత కొడుతున్నారు. అయితే లోతు స‌రిగా అంచ‌నా వేయ‌లేక‌పోయిన ప్ర‌కాశం, మ‌ల్లిఖార్జున నీటి ఊబిలో చిక్కుకుపోయారు. అందులోనే మునిగిపోయారు. ఊపిరాడ‌క అక్క‌డిక‌క్క‌డే మునిగి చ‌నిపోయారు. తోటి స్నేహితులు త‌మ పేరెంట్స్ కు చెప్ప‌డంతో అధికారుల సహాయంతో ఇద్ద‌రి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: