రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసి మూడు వారాలు అయింది. ఫ‌లితం ఎలా ఉంటుంది? అనే అంచ‌నాపై ఎవ‌రికి వారు లెక్క‌లు వేసుకుంటున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ అంచ‌నాలు కూడా భారీగానే ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే అత్యంత కీల క‌మైన ఏపీ ఐటీ రాజ‌ధాని విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌రిస్థితి ఎలా ఉంటుంది? ఎలాంటి విజ‌యం ఇక్క‌డ ల‌భిస్తుంది? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో అర‌కు, మాడుగుల‌, పాడేరు, విశాఖ నార్త్‌ నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా మిగి లిన చోట్ల టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక‌, విశాఖ నార్త్‌.. బీజేపీ, మిగిలిన మూడు చోట్లా వైసీపీ విజ‌యం సాధించింది. అయితే, అప్ప‌టి రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన నాయ‌కులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 


స‌రే ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉంది? ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధిస్తుంది? అనే చ‌ర్చ తీవ్రస్థాయిలో జ‌రుగుతోంది. స్థానికంగా ఉన్న ప‌రిస్థితి, జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌భావం, మార్పు నేప‌థ్యంలో.. విశాఖ‌లో వైసీపీ పుంజుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ ప్ర‌ధానంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస‌ని పాద‌యాత్ర‌, స‌భ‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ కార‌ణంగానే వైసీపీ పుంజుకుంద‌ని అంటున్నారు. ఇక‌, అదేస‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా జ‌గ‌న్‌కు ఒక్క చాన్స్ ఇవ్వాల‌నే ఆలోచ‌న చేసిన నేప‌థ్యంలో విశాఖ‌లో వైసీపీ పుంజుకుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఏడు నుంచి ఎనిమిది స్థానాల్లో వైసీపీ ఇక్క‌డ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. 


విశాఖ అర్బన్ జిల్లాలోని భీమునిపట్నం, రూరల్ జిల్లాలోని మాడుగుల, చోడవరం , పాడేరు. విశాఖ నార్త్‌, అన‌కాప‌ల్లి, అర కు సీట్లు వైసీపీ ఖాతాలో  ఖ‌చ్చితంగా ప‌డ‌తాయ‌ని అంటున్నారు. ఇక‌, ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యానికి వ‌స్తే.. విశాఖ‌లో ట‌ఫ్ ఫైట్ కొన‌సాగ‌డం, ఓట్ల చీలిక ఇక్క‌డ ప్ర‌భావం చూపిస్తాయ‌ని అంటున్నారు. ఇక, అర‌కు ఎంపీ విష‌యంలో మాత్రం వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని చెబుతున్నారు. అన‌కాప‌ల్లిలోకూడా ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని చెబుతున్నారు. మొత్తానికి గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం మూడు స్థానాల‌కే ప‌రిమిత‌మైన వైసీపీ.. ఇప్పుడు పుంజుకుని దాదాపు ఎనిమిది స్థానాల్లో విజ‌యం సాధించేందుకు రెడీ అయింద‌నే స‌మాచారం ఆ పార్టీ నేత‌ల్లో హుషారు నింపుతోంది. మ‌రి వాస్త‌వ ఫ‌లితాల నాటికి ఈ అంచ‌నాలు మ‌రింత పెరుగుతాయేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: