దేశంలో ఐఏఎస్ అంటే ఎనలేని గౌరవం   వుంది. వారు ఓ ప్రాంతానికి చెందిన అధికారులు కారు. మొత్తం దేశానికి సంబంధించిన పరిపాలానాధికారులు. వారికి వివక్ష ఉండదు, రాజకీయాలు అంతకంటే ఉండవు.  అన్ని విషయాలపైన కచ్చితమైన అవగాహన కలిగి  సమర్ధులుగా పరిపాలనను గాడిలో పెట్టి ప్రజలకు మేలు చేసేందుకు వారి సేవలు ఉపయోగపడతాయి. అటువంటి ఐఏఎస్ లు ఈ మధ్య తరచూ చర్చకు వస్తున్నారు.

 

అదీ కూడా ఒక్క  ఏపీలోనే. ఎంతో ఉన్నతమైన చదువు చదివి దేశానికి నాలుగు దశాబ్దల పాటు సేవ చేసేందుకు ప్రతిన పూనిన ఐఏఎస్ లు ఇపుడు క్షుద్ర రాజకీయాలకు బలి అయిపోతున్నారు. రాష్ట్రంలో  ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వారికి దాసోహం అవాలి. అయ్యా ఎస్ అంటూ భజన చేయాలి మరి ఈ రకమైన విధానాన్ని జీర్ణించుకోలేని వారు బదిలీపై వెళ్ళిపోతున్నారు  అంటే టాలెంట్ కంటే తాము చెప్పినట్లు వినాలనుకునే రాజకీయమే మంచి వారిని దూరం చేస్తొందన్న మాట.

 

ఇపుడు ఏపీ విషయానికి వస్తే ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ ఐన ఎల్వీ సుబ్రహ్మణ్యం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటికాలు మీద లేచి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన్ని నేరస్తుల జాబితాలో కట్టేశారు. ఆయనికి పక్షపాతం అపాదించారు. నిత్యం ఆయన్నే గురి చేసుకుని బురద జల్లుతున్నారు. దీని మీద ఇపుడు ఏపీలోని ఐఏఎస్ లు గరం గరం అవుతున్నారు.

 

ఈ నేపధ్యంలో ఈ రోజు విజయవాడ వేదికగా ఐఏఎస్ లు మీటింగు పెట్టబోతున్నారు. ఆ మీటింగులో రాజకీయాలు చేసే వారికి చెంపపెట్టు లాంటి తీర్మానాలు ఉంటాయని అంటున్నారు. ఏపీలో జరుగున్న దానికి ఓ గట్టి ముగింపు ఇచ్చేలా ఈ మీటింగ్ జరుగుతుందని కూడా అంటున్నారు. మరి ఏ జరుగుతుందో చూడాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: