ఏపీలో రిటర్న్ గిఫ్ట్ కి రోజులు దగ్గర పడుతున్నాయా. అంటే అవుననే గులాబీ భవన్ నుంచి సమాధానం వస్తోంది. సరిగ్గా ఆరునెలల క్రిత్రం బంపర్ మెజారిటీతో రెండవమారు టీయారెస్ గెలిచింది. ఆ సందర్భంగా కేసీయార్ మీడియా మీట్లో మాట్లాడుతూ చంద్రబాబుకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కౌంటర్లేశారు. ఆ తరువాత అది ఎంత సెన్సేషన్ అయిందంటే రైవల్ ఎవరైనా  సరే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అనడం ఓ అనావాయితీ అయింది.


ఇదిలా ఉండగా వందకు వంద శాతం ఏపీలో జగన్ గెలుస్తాడని తాజాగా కేసీయార్ కామెంట్స్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చగా మారింది కేసీయార్ జగన్ గురించి ఏమీ మాట్లాడడం లేదు కాబట్టి మేము గెలుస్తునామని ఈ మధ్య టీడీపీ మంత్రితో పాటు బాబు కూడా చెప్పడం తెలిసిందే. అయితే వీటికి చెక్ చెబుతున్నట్లుగా కేసీయార్ ఇపుడు చేసిన కామెంట్స్ టీడీపీ శిబిరంలో మంట పుట్టిస్తాయనడంతో సందేహం లేదు.


నూటికి నూరు శాతం జగన్ ఏపీలో గెలుస్తాడు, నేను ఇంతవరకూ చేయించిన సర్వేల్లనీ అదే చెబుతున్నాయి. నా సర్వేలు ఎపుడూ తప్పు కాలేదని కూడా కేసీయార్ పార్టీ నాయకులతో అన్నట్లుగా తెలిసింది. అందువల్ల తాను తొందర్లోనే ఏపీకి  వెళ్తానని కూడా కేసీయార్ చెప్పారట. జగన్ బంపర్ మెజారిటీతో గెలుస్తున్నారని కేసీయార్ అన్నారని టాక్.


జగన్ సీఎం గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను తప్పనిసరిగా హాజరవుతానని, దాంతో తాను బాబుకు ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ కూడా అందించినట్లు అవుతుందని కేసీయార్ చెప్పారని భోగట్టా. జగన్ ఫెడరల్ ఫ్రంట్ లో భాగ‌మని, ఇకపై రెండు తెలుగు రాష్ట్రాలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతాయని కూడా కేసీయార్ అన్నట్లు సమాచారం.
ఏపీలో ఓడిపోయిన బాబు కధ డిల్లీ జాతీయ రాజకీయాల్లోనూ ముగిసిపోతుందని కూడా కేసీయార్ కామెంట్స్ చేసినట్లుగా చెబుతున్నారు. కాగా కేసీయార్ తో పాటు ఎంపీ కవిత కూడా జగన్ ప్రమాణ స్వీకార‌  కార్యక్రమానికి హాజరుతారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: