కేసీఆర్ .. జగన్ ముఖ్యమంత్రి అవ్వటం ఇక లాంఛనమే అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంకొక అడుగు ముందుకు వేసి జగన్ ప్రమాణస్వీకారానికి వస్తానని చెప్పాడు. ‘తాను జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి హాజరైతే.. తాను చంద్రబాబుకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ 100శాతం పూర్తి అవుతుందని.. ప్రస్తుతం ఆ రిటర్న్ గిఫ్ట్ ప్రాసెస్ లో ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాను జగన్ ప్రమాణానికి వెళ్లాక అక్కడ తన రిటర్న్ గిఫ్ట్ ఏంటో బాబుకు అర్థం అవుతుందని అన్నట్టు సమాచారం.


అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జగన్ గెలుస్తాడా అని టీఆర్ ఎస్ నేతలు అడగగా.... కేసీఆర్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ‘తాను సొంతంగా కొన్ని కీలక సర్వేలు చేశాను. రిపోర్టులు తెప్పించుకున్నాను.  నేను చేసిన సర్వే రిపోర్టులు ఎప్పుడూ తప్పుకాలేదు. అన్ని సర్వేలు జగన్ గెలుస్తాడనే చెబుతున్నాయి. అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నాకే.. జగన్ గెలుస్తాడని నిర్ధారించుకొని ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.


 జగన్ గెలిస్తే తాను అనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ కు మరింత బూస్ట్ ను ఇచ్చినట్టు అవుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డట్టు తెలిసింది. అంతేకాదు..చంద్రబాబు ఓటమితో జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర కూడా ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు. ఓడిపోతే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబును పట్టించుకోరని కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. తనతోపాటు తన కూతురు కవిత కూడా జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని కేసీఆర్ అన్నట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: