ఏపీలో ఓటమి తప్పదని చంద్రబాబు డిసైడ్ అయ్యారా.. గెలిస్తే ఓకే.. లేకపోతే ఓఢిపోతే  ఏం చేయాలని ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేశారా.. ఇప్పుడు ఏపీలో జరగుతున్న పార్టీ సమీక్షలు చూస్తుంటే అదే విషయం అరథమవుతోంది. 


ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. గెలిచినా, ఓడినా పార్టీని కాపాడుకోవాలి. ఇదే ఇప్పుడు చంద్రబాబు ప్లాన్. ఓడిపోతే క్యాడర్ స్థైర్యం  దెబ్బతినకుండా.. ఓటమికి దీటైన కారణాలు వెదకాలి. అందుకే ఆయన రోజూ క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు. 

 మొన్నటివరకూ ఈవీఎంలపై పోరు, ఆ తర్వాత వీవీ ప్యాట్ లెక్కింపుపై న్యాయపోరాటం.. ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం ఇదే. ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్ల లెక్కింపు, కేంద్రంపై పోరుకు చంద్రబాబు రోజురోజుకూ స్వరం పెంచుతున్నారు.

ఓవైపు వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని చెబుతూనే.. మరోవైపు వైసీపీ ట్రాప్ లో తమ పార్టీ నాయకుడు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలని క్యాడర్ ను హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా.. వెంటనే వచ్చే స్ధానిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, సహకార సంస్థల ఎన్నికల్లో పార్టీ డీలా పడకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: