ఏపీలో ఓట్ల లెక్కింపు రోజు ఏం జరుగుతుంది.. ? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దీని కోసం ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్లు మొదలు పెడతారు. 


సాధారణంగా పదిన్నర, పదకొండుకల్లా ట్రెండ్ తెలిసిపోతుంది. ఒకవేళ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వస్తే సరే సరి. లేకపోతే.. మాత్రం రచ్చ రచ్చ చేయాలని టీడీపీ నాయకులకు ఇప్పటికే డైరెక్షన్ వెళ్లిపోయిందని సమాచారం. ఈవీఎంల్లో అవకతవలు ఉన్నాయంటూ టీడీపీ నేతలు ఎక్కడికక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ధర్నాకు దిగుతారట.

అలాగే ఈవీఎం ఓట్లు లెక్కబెట్టాక.. ర్యాండమ్‌గా 5 వీవీపాట్ల ఓట్లు లెక్కించి సరిపోలుస్తారు. దీనిపై కూడా టీడీపీ రాద్దాంతం చేసే ఆలోచన ఉన్నదట. ముందు వీవీ ప్యాట్ ఓట్లు లెక్కించాకే.. అవి సరిపోలాకే.. మిగిలిన ఈవీఎంలు లెక్కపెట్టాలని డిమాండ్ చేసే ఆలోచన ఉన్నదట.  

మొత్తం మీద వైసీపీ గెలిచినా.. ఇది అక్రమంగా గెలిచిన గెలుపు. ప్రజాతీర్పు ఇది కాదనే సందేశం జనంలోకి వెళ్లేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేయవచ్చని తెలుస్తోంది. అవసరమైతే ఏకంగా చంద్రబాబే ధర్నాకు కూర్చోవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా మే 23న ఏపీ కౌంటింగ్‌లో రచ్చ రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: