ఆ రాష్ట్రంలో తుఫాను వచ్చింది. ప్రచండ తుపాను.. కానీ అది పేద రాష్ట్రం. అయినా సరే ఉన్న వనరులతో ఉపగ్రహాలు ఇచ్చిన సమాచారంతో ప్రజలను అప్రమత్తం చేసింది. అధికారులు చిత్తశుద్ధితో పని చేశారు.. దాదాపు పది లక్షల మంది ప్రాణాలను కాపాడారు. 


అంత ప్రచండ తుపాను వస్తే అతి తక్కువ ప్రాణనష్టంతో ఆ రాష్ట్రం బయటపడింది. అదే ఒడిశా. ఆ రాష్ట్రం చేసిన కృషిని ఏకంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక గుర్తించింది. ప్రశంసలతో ముంచెత్తింది. అంతేకాదు లక్షలాది ప్రజల్ని సైక్లోన్ నుంచి ఎలా కాపాడాలో ఆ పేద రాష్ట్రం నుంచి తెలుసుకోండి అంటూ ప్రపంచానికి చాటింది. 

ఇంత జరిగినా ఆ రాష్ట్ర సీఎం పెద్దగా పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోయాడు. అందుకే ఆయన్ని మనం వేస్ట్ ఫెలో అంటున్నాం. అదే ఏపీలో జరిగి ఉంటే.. న్యూయర్క్ టైమ్స్ వంటి పత్రిక మన పనిని గుర్తించి మెచ్చుకుంటే ఎంత హడావిడి జరిగేది. నేను బస్సులో పడుకున్నాను.. హుద్ హుద్ ను తరిమేశాను.. తిత్లీని పొమ్మన్నాను. నేనొక్కడినే కష్టపడ్డాను. అంటూ ఎంత సందడి ఉండేది.. 

మీడియా కూడా.. అదే హుద్ హుద్ విషయంలో ఏ ప్రముఖ అంతర్జాతీయ పత్రికో పొరపొటున ప్రశంసించి ఉంటే.. మరో ప్రచార తుఫాను వచ్చేసేది. తందానతాన అనే మీడియా అదే పెద్ద బ్రేకింగ్ న్యూస్ గా రోజుల తరబడి షోలు నడిపేవి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలో మరో న్యూస్ లేనట్టు ప్రవర్తించేవి. కానీ ఒడిశా సీఎంకు ఇవేమీ చేతకానట్టుంది.. అందుకే మరి ఆయన్ని వేస్ట్ ఫెలో అన్నది. 



మరింత సమాచారం తెలుసుకోండి: