ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికలు అలా ఇలా కాదు. తెగ హీట్ పెంచేస్తున్నాయి. రిజల్ట్ కి కూడా ఎక్కువ టైం ఉండడంతో ఎవరికి తోచిన విశ్లేషణలు వారు ఇస్తున్నారు. మేమే వస్తామని నూటికి వేయి శాతం ఇది నిజమని టీడీపీ అధిఎనత చంద్రబాబు ఓ వైపు చెబుతున్నారు. మరో వైపు తన పార్టీ గెలుపు ఖాయమని వైసీపీ పూర్తి ధీమాతో  ఉంది. మరి జనసేన సీన్లో ఉందా ఉంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి...


దీని మీద సీనియర్ నేత హరిరామజోగయ్య తనదైన విశ్లేషణ తాజాగా మరో మారు అందించారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో అటు టీడీపీకి, ఇటు వైసీపీకి ఎవరికీ పూర్తి మెజారిటీ రాదని జోగయ్య జోస్యం చెప్పారు. మ్యాజిక్ మార్క్ 88 సీట్లను ఆ రెండు పార్టీలు సాధించడం కష్టసాధ్యమని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.


ఇక జనసేనకు 15 నుంచి 20 సీట్లు వరకూ వస్తాయని జోగయ్య చెప్పుకొచ్చారు. ఆయన ఉద్దేశ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో జనసేన వూపు బాగా ఉంటుందని అంచనాగా ఉంది అలా కనుక చూసుకుంతే పవన్ కింగ్ మేకర్ అవుతాడని జోగయ్య అంటున్నారు. పవన్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకో కీలకంగా మారుతారని కూడా జోగయ్య అంటున్నారు. మరి ఇది ఎంతవరకూ నిజమో ఈవీఎంలే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: