ఏపీలో ఈ రోజు  మూడు జిల్లాలలోని అయిదు చోట్ల  రీపోలింగ్ జరుగుతోంది. ఉదయాన్నే  రీపోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో జరిగిన మొదటి పోలింగుకు దాదాపు నెల రోజుల తరువాత ఇపుడు  రీపోలింగ్ జరుగుతోంది. ఈ మధ్యలో ఏపీలో చాలా రాజకీయం నడిచింది. చంద్రబాబు చాలా విషయాల్లో  అతిగా స్పందిస్తూ ప్రతీ రోజు మీడియాలో ఉన్నారు. మరో వైపు పవన్, జగన్ దాదాపుగా సీన్లోనే లేరు. ఇక మొత్తం పోలింగ్ కేంద్రాలు  అయిదింటిలో కలుపుకుంటే దాదాపుగా  అయిదు వేల మంది వరకూ ఓటర్లు ఉంటారు. వీరి ఇపుడు తమ ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నారు.


గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న పోలింగ్ బూతుల్లో రీ పోలింగ్ జరుగుతోంది. మరి ఇక్కడ ఓటరు ఎలా స్పందిస్తారు అన్నది చాలా ముఖ్యం. ఈ జిల్లాల్లొ  పోలింగ్ సరళిని బట్టి వైసీపీకి అనుకూలమని పోలింగ్ అనంతర సర్వేలు చెప్పుకొచ్చాయి. అయితే ఇపుడు రీపోలింగ్ జరుగుతోంది కాబట్టి ఓటరు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది కూడా వేచి  చూడాల్సి ఉంది.


ఈ జిల్లాలలో త్రిముఖ పోటీ ప్రతీ చోటా జరిగిన సందర్భంలో ప్రతి బూతులో ఉన్న వేయి ఓట్లు చాలా ప్రాధాన్యత కలిగినవే. అందువల్ల ఈ ఓటింగుని ఆషామాషీగా ఇపుడు ఎవరూ  తీసుకోలేరు. కానీ ఏప్రిల్ 11న జరిగిన  సార్వత్రిక ఎన్నికల తరువాత  చంద్రబాబు ఓవయాక్షన్, జగన్ సైలెంట్, ఏపీలో రాజకీయ పరిణామాల మీద తమ తీర్పు చెప్పే అరుదైన అవకాశం ఇపుడు ఈ ఓటర్లకు వచ్చిందనుకోవాలి. మరి చూడాలి ఎలాంటి పోలింగ్ ఇక్కడ జరుగుతుందో.వారి అసక్తి ఎలా ఉందో.


మరింత సమాచారం తెలుసుకోండి: