ఏపీలో ఎన్నికల ముందు.. ఎన్నికలు జరిగిన తర్వాత వినిపించిన మాట.. కాబోయే సీఎం  జగనే అని.. పోలింగ్ ముగిసిన చాలా రోజుల వరకూ ఇదే సీన్ కనిపించింది. కానీ ఇప్పుడు క్రమంగా సీన్ మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. 


పోలింగ్ మరుసటి రోజే చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణలు చేయడంతో చంద్రబాబు ఓటమికి సాకులు వెదుక్కుంటున్నారని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు పదే పదే మేమే గెలుస్తామని చెప్పడంతో క్రమంగా టీడీపీ క్యాడర్‌లోనూ విశ్వాసం కనిపిస్తోందట. 

పోలింగ్ అయిన మొదట్లో పెద్దగా మీడియా ముందుకు రాని టీడీపీ నేతలు ఇప్పుడు గెలుపు మాదే అని గట్టిగా చెబుతున్నారు. ఇది చంద్రబాబు ఇచ్చిన ఆత్మవిశ్వాసమే అని కొందరు అంటున్నారు. దీనితో పాటు భారిగా పెరిగిన పోలింగ్ తమకు కలసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. 

అర్థరాత్రి వరకూ చాలాచోట్ల జరిగిన పోలింగ్, పసుపు కుంకుమ ఓట్లు, సుఖీభవ అన్నదాత ఓట్లు ఇవన్నీ తమను తప్పక గెలిపిస్తాయన్న నమ్మకం టీడీపీ నేతల్లో పెరుగుతోందట. వైసీపీ నేతలు మాత్రం మొదటి నుంచీ తమదే గెలుపు అంటున్నారు. ఎవరు ఎన్ని లెక్కలు వేసుకున్నా మే 23న అసలు లెక్క తేలనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: