తెలంగాణ సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రాల టూర్ పెట్టుకున్నారు. ఐదు రోజుల పాటు రెండు రాష్ట్రాలలో ఆయ‌న ప‌ర్య‌టించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనకు సోమ‌వారం కేసీఆర్ బ‌య‌లుదేరుతున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సీఎం కేసిఆర్ సంధర్శించనున్నారు.


సోమవారం మధ్యాహ్నం బేగంపేట్ నుండి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కేసీఆర్ త్రివేండ్రంకు బ‌య‌లుదేర‌నున్నారు. కేర‌ళ‌కు చేర‌చిన అనంత‌రం ఆయ‌న అనంతపద్మ‌నాభస్వామి ఆలయం సంద‌ర్శించుకోనున్నారు. అనంత‌రం కేరళ సీఎం పినారై విజయన్‌తో సమావేశం కానున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎంతోనే డిన్నర్ చేయ‌నున్నారు. 6, 7 తేదీల్లో కోవలంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకోనున్నారు. 8న కన్యాకుమారికి కేసీఆర్ చేరుకోనున్నారు. అదేరోజు కన్యకాపరమేశ్వరి ఆలయం సందర్శన చేసుకోనున్న కేసీఆర్ కుటుంబ స‌భ్యులు రాత్రికి అక్క‌డే బ‌స చేయ‌నున్నారు.


కాగా, 9న కేసీఆర్‌ రామాశ్వేరం చేరుకోనున్నారు. 10 న మధుర మీనాక్షి ఆలయం, 11 న శ్రీరంగం వెళ్ల‌నున్నారు. అదేరోజు చెన్నై నుంచి హైదరాబాద్‌కు కేసీఆర్‌ తిరుగు ప్రయాణం కానున్నారు. స్థూలంగా ఐదురోజుల ప‌ర్య‌ట‌నలో కేసీఆర్ ఇటు రాజ‌కీయ సంబంధ‌మైన అంశాల‌తో పాటుగా అటు ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌కు సైతం వేదిక చేసుకోనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: