ఏపీ ఎన్నికల తర్వాత  చంద్రబాబులో ఓటమి టెన్షన్ పెరిగింది. అంతకు ముందు ఆయన జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తారని అంతా ఆశించారు. కొంతవరకూ బయటి రాష్ట్రాల ప్రచారాలకు వెళ్లినా అది కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకే పరిమితం అయ్యింది. ముందు ఏపీలో గెలిస్తే కదా అన్నట్టు తయారైంది పరిస్థితి.


కానీ అటు కేసీఆర్ కు ఆ ఇబ్బందుల్లేవు.. ఆయన ఇప్పటికే సీఎం రేసులో నెగ్గేశారు. రాష్ట్రంలోనూ ప్రతిపక్షం బలంగా లేదు. అందుకే ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి సారించేందుకు పట్టు చిక్కింది. కొన్నాళ్లకు పక్కకు పెట్టిన  ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును మళ్లీ ఇప్పుడు పట్టాలకు ఎక్కిస్తున్నారు. 

దేశవ్యాప్తంగా అన్నీ పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా  కేరళకువెళ్లారు. త్రివేండ్రంలో కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ఫలితాలపై చర్చిస్తారు. ఫెడరల్ ఫ్రంట్‌కు ఉన్న సాధ్యాలను విజయన్‌కు వివరిస్తారట. 

కేరళ పర్యటన తర్వాత ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కేసీఆర్ టూర్ వేసే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే కేసిఆర్ ఓసారి ఢిల్లీ టూర్ చేపట్టే అవకాశం కూడా ఉంది. ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.ఏదేమైనా కేసీఆర్ జోరు మీద ఉంటే.. చంద్రబాబు టెన్షన్‌లో ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: