కేసీయార్ అంటేనే దూకుడుకు మారుపేరు. ఆయన చేసే రాజకీయం అలాగే ఉంటుంది. అకస్మాత్తుగా దూసుకువస్తారు. అంతవరకూ స్తబ్దుగా ఉన్న ఆయన ఒక్కసారి ఉవ్వెత్తుల లేస్తారు. ఆయన వ్యూహాలు అర్ధం చేసుకునే లోపుగానే కావాల్సింది చక్కబెట్టేస్తారు. దటీజ్ కేసీయార్ అనిపిస్తారు.


ఇపుడు మళ్ళీ దేశ రాజకీయాల్లో కలకలం స్రుష్టించడానికి కేసీయార్ రెడీ అయిపోతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఆరు నెలల క్రితం హల్ చల్ చేసిన కేసీయార్ ఇపుడు దాని స్పీడ్ ని పెంచనున్నారు. ఆయన వరసగా వేస్తున్న టూర్లు ఫెడరల్ ఫ్రంట్ జోరు ఏంటోచెప్పకనే చెబుతున్నారు. అయిదు రోజుల వేసవి విడిది పేరుతో కేసీయార్ ఈ రోజు నుంచి కేరళలో గడపబోతున్నారు. ఇందులో భాగంగా ఆయన కేరళ సీఎం విజయ్ తో చర్చలు జరుపుతారట. ఇది ఓ విధంగా జాతీయ రాజకీయాలను  కుదిపే అంశమే అవుతుంది.


ఈ ఇద్దరు నేతలు రేపటి రోజున కేంద్రంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం చర్చిస్తారని అంటున్నారు. అదే విధంగా తమిళనాడులోనూ ఈ రోజు కేసీయార్ టూర్ ఉంటుందని అంటున్నారు.   ఈ సందర్భంగా డీఎంకే అధినేత స్టాలిన్ తో కేసీయార్ చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఆయన్ని కూడా ఫెడరల్ ఫ్రంట్ లోకి కేసీయార్ ఆహ్వాహిస్తారని అంటున్నారు.


దేశంలో ఈ రోజులో అయిదు దశల పోలింగ్ పూర్తి అవుతోంది.  ఇక మిగిలింది రెండు దశలు అరవై డెబ్బయి ఎంపీ సీట్లు మాత్రమే. ఇప్పటికి ఉన్న సర్వే నివేదికలు చూసుకుంతే కేంద్రంలో  మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడం కష్టమన్న భావన వ్యక్తం అవుతోంది. ఇపుడున్న పరిస్థితుల్లో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ కూడా రెండు వందల  సీట్ల మార్క్ ని దాటవని దీంతో 300 సీట్లకు పైగా ప్రాంతీయ పార్టీలే గెలుచుకుంటాయని కూడా తెలుస్తోంది.
ఈ సర్వేలన్నీ పక్కాగా పరిశీలించిన మీదటనే కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ యత్నాలు ముమ్మరం చేసినట్లుగా చెబుతున్నారు. ఆయన వామ‌పక్షాలను కలుపుకుని ఈ ఫ్రంట్ కి గట్టి రూపం ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇపుడు కేసీయార్ టూర్ జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: