పోలవరం ఇపుడు ఏపీలో గోలవరంగా మారుతోంది. రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ని చేసేశారు. దీని నిర్మాణం సంగతి దేముడెరుగు కానీ ఓట్ల పంట, నోట్ల పంట బాగానే పండిస్తోందంటున్నారు. పోలవరం మూడేళ్ళ నుంచి మాత్రమే టీడీపీ నోట గట్టిగా వినిపిస్తోంది. ఇక ప్రతి సోమవారం పోలవరం వారమని ఆర్భాటంగా ప్రకటించుకున్న చంద్రబాబు తన పాలనలో అలాగే రివ్యూల మీద రివ్యూలు చేశారు. ఇపుడు పోలింగ్ ముగిసింది. ఏపీలో కోడ్ అమల్లో ఉంది.


అయిననూ పోయి రావలే పోలవరానికి అంటూ చంద్రబాబునాయుడు అంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఆయన పోలవరానికి టూర్ వేశారు. పోలవరం పనులను బాబు పరిశీలించారు. వాటి పురోగతిని కూడా తెలుసుకున్నారు. అయితే పోలవరం విజిట్ అన్నది బాబు ఎన్నికల‌ కోడ్ ఉన్న సమయంలో చేయడం అదీ కూడా ఓ వైపు ఏపీలో రీపోలింగ్ జరుగుతున్న వేళ చేయడం నిజంగా కోడ్ ఉల్లంఘనే.


మరి దీన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంటుందా లేక వదిలేస్తుందా అన్నది చూడాలి. అయితే ఈసీతో గొడవ పెట్టుకోవడానికే బాబు రెడీగా ఉన్నారని నిన్నటి ఆయన మీడియా సమావేశంలో చేసిన కామెంట్స్ చెప్పేశాయి. తాను పోలవరం వెళ్తాను ఎవరు ఆపుతారో చూస్తాను అంటూ బాబు చేసిన హెచ్చరికలాంటి కామెంట్స్ ఆయన వైఖరిని పక్కాగా  బయటపెట్టాయి. ఇపుడు బాబుని అలా వదిలేస్తారా లేక ఏమైనా చర్యలు ఉంటాయా అన్నది చూడాలి. అయితే బాబు రివ్యూ మీటింగునకు అధికారులు ఇంతకీ హాజరవుతారా చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: