ఈ మద్య వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.  మొన్న అమెరికాలో..నేడు  రష్యాకు చెందని ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానం ప్రమాదం.  అయితే మొన్న అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. తాజాగా రష్యాకు చెందని ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానంలో మంటలు  చెలరేగడంతో 41మంది మృతిచెందారు. 

ఈ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పైలెట్ ప్రమాదాన్ని గమనించి  విమానాన్ని అత్యవసరంగా దించివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నేలను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. దాంతో వెనుక భాగం నుంచి మంటలు పెద్ద ఎత్తున్న అలముకున్నాయి. 

కాగా, అందులో ప్రయాణిస్తున్న 41 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి 78 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. మిగిలిన 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు.  ప్రమాదం తెలిసిన వెంటనే విమానం ముఖ ద్వారం గుండా కొంత మంది దూకి తమ ప్రాణాలు రక్షించుకున్నారు.   ఈ ఘటనపై విచారణ జరుపుతున్న విచారణ కమిటీ వెల్లడించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: