ఇపుడందరి చూపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వైపే చూస్తున్నాయి. 10వ తేదీన క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించటమే ఇందుకు ప్రధాన కారణం.  ఎలక్షన్ కమీషన్ తో ఘర్షణ పడాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నపుడు క్యాబినెట్ సమావేశం పెట్టకూడదని చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా సమావేశం పెట్టాలని నిర్ణయించుకున్నారంటే ఏమిటర్ధం ?

 

సరే క్యాబినెట్ సమావేశం పెట్టాలని నిర్ణయించుకోవటం వరకూ చంద్రబాబు ఇష్టమే. కానీ అందుకు ఎలక్షన్ కమీషన్ అనుమతి కావాలి కద ? ఎందుకంటే క్యాబినెట్ కు ప్రధాన కార్యదర్శి కన్వీనర్ . ఎన్నికల కోడ్ దృష్ట్యా  సిఎస్ కూడా ఎలక్షన్ కమీషన్ పరిధిలోనే ఉంటారు. కాబట్టి ఎలక్షన్ కమీషన్ అనుమతి లేకుండా సిఎస్ క్యాబినెట్ అజెండాను సిద్ధం చేయరు.

 

క్యాబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వకపోతే, సిఎస్ అజెండా రెడీ చేయకపోతే చంద్రబాబు ఏం చేస్తారు ? ఉత్తినే మంత్రులతో పిచ్చాపాటీ కాలక్షేపం చేస్తారా ? లేకపోతే వాళ్ళ నియోకవర్గాల్లో గెలుపోటములపై సమీక్షించి వెళ్ళిపోతారా ?  చంద్రబాబు కావాలనే ఈసి, సిఎస్ తో గొడవ పెట్టుకోవాలని చూస్తున్న విషయం తెలిసిపోతోంది. ఎందుకంటే, ప్రస్తుతం చంద్రబాబుకు ప్రధాన శతృవులు ఇసి, సిఎస్సే కాబట్టి.

 

చంద్రబాబు ఆలోచనంతా విచిత్రంగా ఉంటుంది. దాదాపు ఏడాది క్రితం వరకూ చంద్రబాబుకు శతృవులుగా కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఉండేవారు. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత నరేంద్రమోడి, జగన్, కెసియార్ శతృవులుగా తయారయ్యారు.  ఎన్నికల సమయంలో మోడి, జగన్, కెసియార్ కంటిన్యు అయ్యారు. పోలింగ్ కు కొద్ది రోజుల ముందు నుండి ఎలక్షన్ కమీషన్, చీఫ్ సెక్రటరీ కూడా తోడయ్యారు.

 

తాజాగా అంటే పోలింగ్ ముగిసిన తర్వాత నుండి ఇప్పటి వరకూ ఎలక్షన్ కమీషన్, ఎల్వీ సుబ్రమణ్యం ప్రధాన శతృవులుగా మిగిలారు. ఎలక్షన్ కమీషన్ ను చంద్రబాబు చేయగలిగేదేమీ లేదు. అందుకే ఎల్వీనే ప్రధానంగా చంద్రబాబు టార్గెట్ గా పెట్టుకున్నారు. అందులో భాగమే 10వ తేదీన క్యాబినెట్ సమావేశం ఆలోచన. రేపటి కౌంటింగ్ లో టిడిపి ఓడిపోతే ఎల్వీని చంద్రబాబు చేయగలిగేదేమీ లేదన్న విషయం తెలిసిందే.  టిడిపి మళ్ళీ గెలిస్తే మాత్రం ఎల్వీకి ఇబ్బందులు తప్పవు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: