గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. న‌గ‌ర శివారులోని పొత్తూరు స‌మీపంలో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. చేబ్రోలులోని ఓ పొగాకు గోదాంలో భారీ ఎత్తున‌ మంటలు ఎగసిపడ్డాయి. వెంట‌నే అగ్ని మాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు స్థానికులు. స‌మాచారం అందుకున్న వెంట‌నే ఆరు ఫైర్ ఇంజ‌న్ల‌తో అక్క‌డ‌కు చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. మంట‌ల‌ను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. 


 మొత్తం ఐదు గోదాముల్లో రెండింటిలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఆరు శకటాలతో ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. నగర శివారు పొత్తూరు సమీపంలో వీరి పొగాకు గోదాములు ఉండ‌గా.. ఫ‌స్ట్ ఒక గోదాములో మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ఆ త‌ర్వాత గోదామ మొత్తం వ్యాపించాయి. మంట‌లు మొత్తం వ్యాపించ‌డంతో పెద్ద ఎత్తున ఎగిసిప‌డ్డాయి. 


మ‌రోవైపు గుంటూరులో ఉన్న మూడు అధునాతన‌ అగ్నిమాపక యంత్రాలతోపాటు తెనాలి, చిలకలూరి పేటలో ఉన్న మరో మూడు యంత్రాలతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. శకటాల్లోని నీరు సరిపోక పోవడంతో గోదాము యాజమాన్యం ట్యాంకర్లతో తీసుకొచ్చి మ‌రీ మంట‌ల‌ను అదుపు చేసే ప్ర‌య‌త్నం చేశారు. 


ఇటు మిగిలిన మ‌రో 3 గోదాంల‌కు మంట‌లు విస్త‌రించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. మంట‌ల‌ను అదుపులోకి తె్చ‌చేందుకు మ‌రో నాలుగు గంట‌ల టైమ్ ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. ఆస్తి న‌ష్టం తీవ్రంగా ఉంటుండొచ్చ‌ని అధికారులు చెబుతున్నారు. అంచ‌నాకు వ‌స్తున్నారు. ఫ‌స్ట్ అయితే మంట‌ల‌ను అదుపుచేసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: