ఐపీఎల్ అంటే టీమ్‌ల‌ను కొనుగోలు చేసిన య‌జ‌మానులైన బుకీల కంటే ఎక్కువ ఆనంద‌ప‌డ‌రేమో. ఏ టీమ్‌లో ఎక్కువ స్టార్లు ఉంటే.. ఏ టీమ్ ఎక్కుగా గెలుస్తుంటే ఇక బుకీల పంట పండిన‌ట్లే.. అమాయ‌కుల‌కు వ‌ల వేసి కోట్ల రూపాలు దండుకుంటున్నారు. 


క్రికెట్ అంటే కొంద‌రికి జ‌స్ట్ గేమ్. మ‌రికొంద‌రికి పిచ్చి .. ఇంకొంద‌రికి క్రికెట్ అంటే క్యాష్‌.. ఇంట్లో కూర్చుని ఈజ మ‌నీ సంపాధించ‌డానికి షార్ట్ క‌ట్ రూట్‌. అవును ఐపీఎల్ అంటే ముందు గుర్తొచ్చేది గేమ్ కాదు. గ్యాంబ్లింగ్‌. కోట్ల‌కు కోట్లు చేతులు మారే ఆటే ఐపీఎల్‌. ఐపీఎల్ మొద‌ల‌య్యాక క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంత హ్యాపీగా ఫీల‌య్యారో తెలియ‌దు కానీ.. పండ‌గ చేసుకుంటున్న‌ది మాత్రం బెట్టిం మాఫియానే ..!


ఈ నేప‌థ్యంలో తాజాగా అనంత‌పురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆట క‌ట్టించారు పోలీసులు. ఇద్ద‌రు బుకీలు స‌హా మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.25 ల‌క్ష‌ల న‌గ‌దు, 38 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మ‌రో కీల‌క బుకీ స‌య్య‌ద్ ఖాద్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇత‌నిపై హ‌త్య‌కేసుతో పాటు మ‌రో ఏడు కేసులున్నాయి. 
అయితే ఈ బుకీలు బెట్టింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపించే వారిని టార్గెట్ గా చేసుకుని డ‌బ్బులు సంపాదిస్తున్నార‌ని తెలిపారు. గూగుల్ ప్లేస్టోర్ లో కొన్ని ర‌కాల యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని బెట్టింగుల‌కు పాల్ప‌తున్నార‌ని పోలీసులు తెలిపారు.


ఐపీఎల్ ఎసీజ‌న్ కావ‌డంతో బెట్టింగ్ రాయుళ్ల కోసం పోలీసులు గ‌ట్టి నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా స్పెష‌ల్ టీమ్స్‌ను సిద్ధం చేసి బెట్టింగ్ కార్య‌క‌లాపాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం తెలుసుకుని దాడులు చేస్తున్నారు. బెట్టింగ్ ముఠా వెనుక పెద్దల హ‌స్తం ఉంద‌ని పోలీసులు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: