ఆయ‌న మంత్రి కాదు. ఆయ‌న‌కు ఏ అధికారాలు లేవు. కేవ‌లం అధికార పార్టీ టీఆర్ ఎస్ వ్య‌వ‌హారాలకు అధ్య‌క్షుడు. అం టే.. నేరుగా ఆయ‌న ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌తోకానీ, అధికారులు, పోలీసు వ్య‌వ‌స్థ‌తో కానీ నేరుగా సంప్ర‌దించ‌డం, ఆదేశాలు జారీ చేయ‌డం అనేది ఉండ‌నే ఉండ‌దు! అయితే ఇది పైకి క‌నిపించే వాస్తవం.  కానీ, తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ త‌ర్వాత అంతా ఆయ‌నే. రాష్ట్రంలో ఏం జ‌ర‌గాల‌న్నా.. ఎవ‌రి స‌మ‌స్య తీరాల‌న్నా.. నేరుగాఆ ఆయ‌న‌కే ఫోన్, నేరుగా ఆయ‌న‌కే ట్వీ ట్‌,నేరుగా ఆయ‌న‌కే మెసేజ్‌. ఆ వెంట‌నే ఆయ‌న ఆదేశాల మేర‌కు అధికారులు రంగంలోకి వ‌స్తారు. శాఖ‌ల‌తో ప‌ని లే కుం డా అన్ని శాఖ‌ల వారూ ఆ స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెడ‌తారు. ఇది ఇప్పుడు మంత్రి కాని మంత్రి షాడో మంత్రి వెల‌గ‌బెడుతున్న రాజ‌కీయం. 


ఆ షాడో మంత్రి ఎవ‌రో కాదు. స్వ‌యానా సీఎం కేసీఆర్ త‌న‌యుడు, టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ఆయ‌న దె బ్బ కు కీల‌క శాఖ‌ల్లోని మంత్రులు కూడా సుప్త‌చేత‌నావ‌స్థ‌లోకి వెళ్లిపోతున్నారు. ``మేమున్నామంటే.. ఉన్నా.. అన్నీ ఆయ నకే చెబుతున్నారు! మేం ఎందుకు ఇక్క‌డ‌?``- అని మంత్రులు వాపోతున్నారు. త‌మ స‌న్నిహితుల‌కు చెప్పుకొని త‌లబా దుకుంటున్నారు. వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ త‌న గుప్పిట్లో పెట్టుకుని, పైకి మంత్రిగా లేక‌పోయినా.. అన‌ధికారికంగా మంత్రిగా చ‌లా మ‌ణి అవుతున్నారు కేటీఆర్‌. ఇటీవ‌ల ఇంట‌ర్ ఫ‌లితాల విష‌యంలో రాష్ట్రంలో పెద్ద‌గంద‌ర‌గోళం జ‌రిగింది. వెంట‌నే మీడియాకు క‌నిపించిన కేటీఆర్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు పాత్రికేయులు. 


అయితే, ఇదంతా నాకేం సంబంధం., నేను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ని, నాకు-ప్ర‌భుత్వానికి, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు సంబంధం లేద‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో మీడియా నిజ‌మే క‌దా! అనుకుంది. అదే రోజు సాయంత్రం.. ఇంట‌ర్ బోర్డు సీనియ‌ర్ అధికారికి ఓ ఆదేశం వ‌చ్చింది. ఆ వెంట‌నే రీవాల్యూయేష‌న్‌కు అయ్యే ఖ‌ర్చు క‌ట్ట‌క్క‌ర్లేద‌ని విద్యార్థుల‌కు సందేశాలు పంపారు. అయితే, దీనివెనుక ఉన్న‌ది కేటీఆర్ అని నెమ్మ‌దిగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇలా ఆయ‌న మంత్రిగా లేక పోయినా.. మంత్రిగా చ‌లామ‌ణి అవుతుండ‌డంతో త‌మ మాట‌లు అధికారులు వినిపించుకోవ‌డంలేద‌ని మంత్రులుగా ఉన్న వారు త‌ల‌బాదుకుంటున్నారు. ఇక‌, వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల విష‌యంలోనూ ఎక్కువ మంది ప్ర‌జ‌లు కేటీఆర్‌కే సందేశాలుపంప‌డం వాటిని ఆయ‌న తెర‌చాటుగా ప‌రిష్క‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఈ షాడో వ‌ల్ల ప్ర‌జ‌లకు మేలు జ‌రిగితే జ‌రిగి ఉండొచ్చుకానీ, పైకి ప‌ద‌వి లేదంటూనే ఇలా పాల‌న‌లో జోక్యం చేసుకోవ‌డంపై మాత్రం విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: