చంద్రబాబు తనయుడు .. ఎపి పంచాయతీ మంత్రి అబ్బో ఒకటేంటి లోకేష్ గారి అర్హతలు చాలానే ఉన్నాయి. కానీ ఇన్ని ఉన్నప్పటికీ మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా అంటే చెప్పలేని పరిస్థితి. అయితే  ఎన్నికల టైమ్ లో ఊరూవాడా అంతా తిరుగుతారు. ఎందుకంటే అది అవసరం. ఓట్ల కోసం ఎన్నో ఫీట్లు చేస్తారు. అయితే ఎన్నికల తర్వాత కూడా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. అది హుందాతనం. ప్రజల మధ్య తిరగకపోయినా, కనీసం మీడియాకు అయినా కనిపించాలి. లోకేష్ ఆ పని కూడా చేయలేదు.


తండ్రి చంద్రబాబు ఆదేశాలతో ఆమధ్య ఎన్నికల సంఘంపై విరుచుకుపడి, సమీక్షలు నిర్వహిస్తానని ప్రకటించిన చినబాబు.. ఆ తర్వాత పత్తా లేకుండాపోయారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీడీపీ నుంచి బరిలోకి దిగిన లోకేష్ మధ్య భారీ పోటీ నెలకొంది. ఇద్దరూ హోరాహోరీగా ప్రచారం చేశారు. అయితే పోలింగ్ తర్వాత కూడా ఆర్కే అక్కడే ఉన్నారు. ప్రజలతో మమేకమైపోయారు.


లోకేష్ మాత్రం ఇంట్లో కూర్చున్నారు. ట్వీట్లతో కాలక్షేపం చేస్తున్నారు. లోకేష్ భాషలోనే చెప్పుకోవాలంటే, ఆయన ఇప్పుడు కూడా మంత్రి. పరిమిత అధికారాలతోనే కావాలంటే చాలా చేయొచ్చు. కానీ ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. కోడ్ కారణంగా చీకటి జీవోలు ఇష్యూ చేసే పరిస్థితి లేకపోవడంతో, ఎంచక్కా ఏసీలోనే కాలక్షేపం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: