గత నెల 11 న ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరిగింది.  ఈ సందర్భంగా పలు చోట్ల ఈవీఎంలు ఇబ్బందులు పెట్టడం మరికొన్ని చోట్లు అసాంఘిక శక్తులు రెచ్చిపోయి..పోలింగ్ బూత్ వద్ద రగడ చేయడంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేశారు.  ఏపీలో ఐదు స్థానాల్లో నేడు రీపోలింగ్ కు ఎన్నిక‌ల క‌మిష‌న్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రి పోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఏపీలో అయిదు చోట్ల రీ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్‌ సాయంత్రానికి ఊపందుకుంది. సూళ్లూరు పేట అసెంబ్లీ సెగ్మెంట్‌ 197 పోలింగ్‌ స్టేషన్‌ అటకానితిప్పలో 578 ఓట్లు ఉండగా ఇప్పటివరకూ 464 ఓట్లు పోల్‌ అయ్యాయి. మరోవైపు గుంటూరు జిల్లా కేశానుపల్లిలో పోలింగ్‌ శాతం పెరిగింది.  మరోవైపు నల్లచెరువులో పోలింగ్‌ శాతం తగ్గింది. 

తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి అటకానితిప్పలో జరుగుతున్న రీ పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల వరకు  87.34 శాతం నమోదైంది.  ఓట్లు పోల్‌ అయ్యాయని..సాయంత్రానికి ఎండ తీవ్రత తగ్గడంతో పోలింగ్‌ శాతం పెరిగింది ఎన్నికల కమీషన్ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: