కేసీఆర్ తన ఇంటెలిజెన్స్ తో సర్వే చేయించుకున్నార్ఫో, లేక ఏపీ ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబు టిడిపి శంకరగిరి మాన్యాలు పడుతుందని తన మేదస్సుతో గణించారో తెలియదు గాని వైసీపీ గెలుస్తుందనే గట్టి నమ్మకంతో మాత్రం ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వైఎస్ జగన్మోహనరెడ్డితో కలిసి ఈసారి చంద్రబాబు నాయుడిని ప్రక్కకునెట్టి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రణాళిక రచించినట్టు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. 

జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్, వైసీపీ పాత్ర ఏ విధంగా ఉండాలనే దానిపై ఇప్పటికే ఇరు పార్టీల నేతల మధ్య సరైన అవగాహన ఉందని, అందుకు తగ్గట్టుగానే ఈ రెండు పార్టీలు ముందుకు సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్, ఇందు కోసం తన సారథ్యంలో ఫెడరల్ ఫ్రంట్‌ ను ఏర్పాటు చేయాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 
Image result for kcr jagan images
ఫెడరల్ ఫ్రంట్‌ ను ఏర్పాటును వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణంస్వీకారం చేయబోయే వేదికపై చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. లోక్-సభ ఎన్నికలతో పాటు జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు.  కార్యక్రమానికి జాతీయస్థాయిలోని పలు ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు కూడా సమాచారం.

లోక్-సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన ప్రాంతీయపార్టీల అధినేతలను జగన్మోహనరెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించి, అక్కడి నుంచి జాతీయ రాజకీయా ల్లో చక్రం తిప్పడంపై కేసీఆర్ వ్యూహారచన చేసినట్టు సమాచారం. 
Image result for kcr jagan images
ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి జాతీయపార్టీల మద్దతు తీసుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కేసీఆర్, అలా చేయడం వల్ల రాష్ట్రాల అధికారాలు మరింత బలోపేతమవుతాయనే ఆలోచనే కీలకం అంటున్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత కూడా దీనిపై పలువురు ప్రాంతీయపార్టీల నేతలతో చర్చించ నున్న కేసీఆర్, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రమాణస్వీకారోత్సవం వేదికపైనే ఫెడరల్ ఫ్రంట్ బల (నిరూపణ) ప్రదర్శన చేయాలనే యోచనలో ఉన్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అదే ఇంతకాలం చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్హే రిటర్న్ గిఫ్ట్ గా చెపుతున్నారు. మొత్తానికి కేసీఆర్ అను కున్నది అనుకున్నట్టుగా జరిగితే, జగన్ ప్రమాణస్వీకారోత్సవ సభలో పాల్గొనడం ద్వారా నారా చంద్రబాబు నాయుడును ఓడించాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చు కోవడంతో పాటు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కూడా బాటలు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

Image result for kcr jagan images

మరింత సమాచారం తెలుసుకోండి: