ఏపీలో ఐదేళ్ల‌పాటు అధికారంలో కొన‌సాగిన తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు త్వ‌ర‌లో అధికారం దూరం కాబోతుంద‌నే భ‌యం మొద‌లైందా? ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను టీపీడీ నేత‌లు ఇదే కోణంలో చూస్తున్నా?  టీడీపీ తీరుపై వైసీపీ నేత వాసిరెడ్డి ప‌ద్మ తాజాగా ఇదే త‌ర‌హా కామెంట్లు చేశారు. వైసీపీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ, సీఎం కుర్చీకి దూరం కావాల్సి వస్తుందనే భయం చంద్రబాబు కలుగుతోందన్నారు. టీడీపీలో ఎక్కడ తిరుగుబాటు వస్తుందో అనే భయం కారణంగా ఈసీపైన, ఈవీఎంలపై,జగన్ కుటుంబంపై చంద్రబాబు మాట్లాడుతున్నారని స్ప‌ష్టం చేశారు. ఆ భయం వల్లనే సంధిప్రేలాపనలు మాట్లాడుతున్నారు.


టీడీపీలో సంక్షోభం వస్తుందనే భయంతో చంద్ర‌బాబు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని వాసిరెడ్డి ప‌ద్మ ఆరోపించారు. ``చంద్రబాబు హీన దీన స్దితిలో ఉంటున్నారు.చంద్రబాబుగారు భాద్యతగా ఉండండి. ఇప్పటివరకు టిడిపి అధికారంలో ఉంది రేపు అదికారానికి దూరంకాబోతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు భాధ్యతా రహితంగా మాట్లాడటం అభ్యంతరకరం.ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత చంద్రబాబు కోల్పోయారు.ప్రజల తీర్పును గౌరవించాల్సిన భాద్యత ఏ రాజకీయపార్టీకైనా ఉంది. ఆ భాద్యతను విస్మరించరాదు.ప్రజలంటే మాకు లెక్కలేదు అనేలా టిడిపి నేతల వ్యవహారశైలి ఉంటుోంది. మా తప్పులను ఎవరు ఎత్తిచూపకూడదు.అని వారంటున్నారు. 


ఇలాంటి మాట్లాడితే ప్రజలు బుద్ది చెప్తారు.కోడెలగారికి ఎదురైన పరిస్దితి దయచేసి అందరూ తెచ్చుకోవద్దు.`` అని న‌ర్మ‌గ‌ర్భంగా విశ్లేషించారు. 
ప్రతిపక్షనేత కుటుంబంతో సినిమాకు వెళ్లడాన్ని కూడా రాజకీయం చేసే దౌర్బాగ్యస్దితికి చంద్రబాబు దిగజారారని వాసిరెడ్డి ప‌ద్మ వ్యాఖ్యానించారు. ``దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదు.ఇది రాక్షస ప్రవృత్తి కాదా రాష్ట్రానికి  సంభందించిన ప్రయోజనాలను తాకట్టుపెట్టారు.

జగన్‌కు ఏ హక్కులు ఉండకూడదు.జీవించే హక్కు ఉండకూడదనే హత్యాయత్నం చేశారు. భార్యపిల్లలతో సినిమాకు కూడా వెళ్లకూడదా? జగన్ నిత్యం ప్రజల మధ్య‌ గడిపారు. 14నెలలు ప్రజల మధ్య‌నే పాదయాత్ర చేశారు. లండన్ టూర్ కు వెళ్తున్నట్లు జగన్ గారు ఎప్పుడు ప్రకటించలేదు. దేన్నైనా రాజకీయం చేయడం నేర్చుకున్నారు టిడిపి నేతలు ఇది మంచిపద్దతి కాదు. `` అని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: