ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని చోట్ల అధికారం కోసం పెనుగులాట, పోటీ తప్పనిసరిగా ఉంటాయి. గెలిచిన పార్టీ పవర్ చలాయిస్తుంది. ఓడిన పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంది. ఈ క్రమంలో కొంత వైషమ్యాలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉండడాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ అది శ్రుతి మించితే దారుణంగా ఉంటుంది. రాజకీయాలు ప్రమాదంలో పడతాయి.


ఏపీలో ఇపుడు అదే జరుగుతోంది. టీడీపీ, వైసీపీల మధ్య గతంలో ఎన్నడూ లేని రాజకీయ యుధ్ధం సాగుతోంది. అయిదేళ్ళుగా రెండు పార్టీలు హద్దులను దాటేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా బాబుని జగన్ గౌరవించరన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే జగన్ని ప్రతిపక్ష నేతగా బాబు అసలు అంగీకరించరన్నది రుజువవుతూ వచ్చింది. ఆఖరుకు  ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే ఫోన్ చేసి పరామర్శ చేసేందుకు కూడా సీఎం ఇష్టపడలేదంటే ఎంత విద్వేషపూరిత రాజకీయాలు ఏపీలో అమలవుతున్నాయో అర్ధం చేసుకోవాలి.


ఇపుడు ఇవి దారి తప్పి ఐఏఎస్, ఐపీఎస్ ల మీద కూడా పడుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం  వైసీపీ  మనిషి అని టీడీపీ ఆరోపణలు చేస్తూంటే, ఏపీలో కీలకమైన డీజీపీ ఠాకూర్ టీడీపీ మనిషి అని వైసీపీ చాలా కాలంగా అరోపణలు చేస్తోంది. దీనివల్ల బాధ్యత గల అధికారులు నలిగిపోతున్నారు. భారత సర్వీసులకు చెందిన ఉన్నతాధికారులు  ఈ దిగజారుడు రాజకీయాలకు బలి అవుతున్నారు. రేపటి రోజున ఈ రెండు పార్టీలో ఏదో ఒకటి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. అపుడు కూడా ఇదే రకమైన రాజకీయం మరింతగా ముదురుతుందని అంటున్నారు. దాంతో ఐఏఎస్ లు,  ఐపీఎస్ లు ఏపీ వైపు చూస్తారా అన్న అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: