చంద్రబాబు తాను ఒకటి అనుకుంటారు. అది పది మందికి వందల సార్లు చెబుతారు. దాంతో  ఛివరికిఉ అది సత్యమే కూర్చుంటుంది. ఈ టెక్నిక్ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తూనే ఉన్నారు. అందులో విజయవంతం అవుతూనే ఉన్నారు. తాజాగా ఆయన గారికి ఈవీఎంల మీద ఎక్కడ లేని డౌట్లు పుట్టుకువచ్చాయి. దాంతో పేపర్ బ్యాలెట్ ముద్దు అంటున్నారు. అందాక మధ్యే మార్గాన్ని కూడా బాబు గారు కనుక్కున్నారు.


అదే వీవీ పాట్స్. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో యాభై శాతం వీవీ పాట్స్ ని లెక్కబెట్టాల్సిందేనని బాబు గారు తాజా డిమాండ్. దీని మీద పోరాటం ఆపేది లేద‌ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఎందాకైనా వెళ్తామని కూడా కచ్చితంగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రతి అసెంబ్లీకి 5 పొలింగు బూతుల్లోని వీవీ పాట్స్ లెక్కిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. దానికి సుప్రీం కోర్టు కూడా సరేనంది.
అయినా సరే పట్టు విడవమని మన బాబోరు యాభై శాతం అంటున్నారు.


ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను ఒకేసారి అన్ని కౌంటింగ్‌ టేబుళ్లపైన సమాంతరంగా లెక్కిస్తే తొమ్మిది గంటల వ్యవధిలో గణన ప్రక్రియ పూర్తయిపోతుందని చంద్రబాబు చెబుతున్నారు. ఈ విధానాన్ని అనుసరిస్తే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సుప్రీం కోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో పేర్కొన్నట్లు వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపునకు ఆరు రోజుల సమయమేమి పట్టదని అభిప్రాయపడ్డారు. 


50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించాలని కోరుతూ మళ్లీ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు ఒక లేఖ రాశారు. ఇక, దాని మీద 21 ప్రతిపక్షాలు వేసిన రివ్యూ పిటిషవ్ ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. మరి సుప్రీఎం ఏం చెబుతుంది అన్నది ఆసక్తికరమైన అంశం.ఒకవేళ సుప్రీం విపక్షాలు కోరినట్లుగా యాభై శాతం లెక్కించమంటే మాత్రం ఎన్నికల ఫలితాలు మరింత జాప్యం అవుతాయి. దానికి సంబంధించిన మందీ మార్బలం కూడా సమకూర్చుకోవాల్సిఉంటుంది. ఏది ఏమైనా ప్రజా తీర్పు మారదు కదా. కానీ మన బాబు గారు మాత్రం తనదే గెలుపు అంటారు. తప్పు మాత్రం ఈవీఎంలదేనని చెబుతారు. ఈ గోలంతా అధికారం, రాజకీయం కోసమేనని ఏపీలోని విపక్షాలు అంటున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: