అంతా మా ఇష్టం..మేం ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు కొంత మంది రాజకీయ నాయకులు..బడా బబులు.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల జరుతున్న విషయం తెలిసిందే.  చాలా చోట్ల ఈవీఎం ల ఇబ్బందులు తలెత్తడం..వాటి స్థానంలో కొత్త ఈ వీఏంలు తీసుకు రావడం..పని చేయని చోట తిరిగి మరోతేదికి రీ పోలింగ్ జరిపించడం జరుగుతుంది.  ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి.  ఆ మద్య ఏపిలో వివి ప్యాట్స్ కి సంబంధించిన స్లిప్పుల కలకం హాట్ టాపిక్ గా మారింది. 

తాజాగా   ఇప్పుడు మరో దారుణం వెలుగులోకి వచ్చింది.  దేశంలో ఎన్నో అరాచకాలకు, అక్రమాలకు అడ్డాగా ఉన్న బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి.  ఇక్కడ ఎన్నికలకు ముందు నుంచి ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా..గొడవలు మాత్రం బీభత్సంగా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మరోసారి పోలింగ్ సందర్భంగా సెక్యూరిటీ వైఫల్యాలు పలుచోట్ల కనిపిస్తున్నాయి. ముజఫరాబాద్ లోని ఓ హోటల్ లో ఏకంగా ఆరు ఈవీఎంలు, వీవీప్యాట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ సీజ్ చేశారు. దాంతో ఎలక్షన్ కమీషన్ సభ్యులు షాక్ తిన్నారు. 

కాగా, ఈ ఈవీఎంలు, వీవీప్యాట్లను సెక్టార్ మేజిస్ట్రేట్ అవధేశ్ కుమార్ హోటల్ కు తీసుకెళ్లినట్టు సమాచారం. తన డ్రైవర్ ఓటు వేసేందుకు గాను వీటిని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.  ఎంతో సీక్రెట్ గా వ్యవహారం నడిపించాలనుకున్నా..బండారం బట్టబయలైంది. దాంతో భారీ ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. మేజిస్ట్రేట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అవధేశ్ కుమార్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. అతనిపై డిపార్ట్ మెంటల్ విచారణ జరుగుతుందని జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఘోష్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: